Reading Time: < 1 minute

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ధురంధర్’. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ప్రకటించారు. ఆ సీక్వెల్ త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది. ‘ధురంధర్-ది రివేంజ్’ పేరుతో ఆ సీక్వెల్ విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచారంలో వేగం పెంచేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. రెహమాన్ డెకాయిట్ మృతి జరిగే అల్లర్లను ట్రైలర్ ప్రారంభం అవుతోంది. ఈ ట్రైలర్ చూస్తే మొదటి భాగం కంటే ఎక్కువ యాక్షన్ ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇక సంజయ్ దత్, సారా అర్జున్‌లు ఈ సినిమాలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. తొలి భాగం కేవలం హిందీలో విడుదల కాగా.. రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.