Reading Time: < 1 minute

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్- ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది పోస్ట్- ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ ౩౦న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆమె సంప్రదాయ శైలిలో కనిపిస్తూ కూడా గ్లామరస్‌గా ఆకట్టుకుంటున్నారు.

సినిమాలో ఆమె అచ్చియమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. ఇదే సందర్భంగా చిత్రబృందం జాన్వీ కపూర్‌కు స్పెషల్ బర్త్‌డే ట్రిబ్యూట్ వీడియోను కూడా విడుదల చేసింది. వీడియోలో జాన్వీ సంప్రదాయ లుక్స్‌లో మెగాఫోన్ పట్టుకుని, వింజ్ మైక్ ముందు పాట పాడుతున్నట్లు కనిపిస్తారు. అలాగే దర్శకుడు బుచ్చి బాబు సాన, హీరో రామ్ చరణ్‌తో ఆమె మాట్లాడుతున్న మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ ఇతర ప్రముఖ పాత్రలను పోషిస్తున్నారు.