
కోడిగుడ్డు ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. మొన్నటిదాకా పెరిగిన ధరలు ఇప్పుడు హాఫ్ రేటుకు పడిపోతుండటంతో పౌల్ట్రీ యజమానులు ఆందోళన అంతా ఇంతా కాదు. అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని కబనరుస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రధానం గా మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం) దేశాలకు జరిగే ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో దేశీయంగా కోడిగుడ్ల నిల్వలు భారీగా పేరుకు పోయాయి. దీని ప్రభావంతో గుడ్ల ధరలు దారుణంగా పడిపోయి పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాల బారిన పడుతున్నారు. ఈ సంక్షోభం కారణంగా పౌల్ట్రీ రంగానికి రోజుకు దాదాపు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు మార్కెట్ వర్గాల అంచనాగా ఉంది.
సాధారణంగా ఎగుమతులు సాఫీగా సాగే సమయంలో గుడ్డు ధర ఆశాజనకంగానే ఉంటుంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ. 4.30గా నిర్ణయించినప్పటి కీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. డిమాండ్ లేకపోవడంతో స్థానిక మార్కెట్లలో ఒక్కో గుడ్డు కేవలం రూ. 3.50 మాత్రమే పలుకు తోంది. కొన్ని ప్రాంతాల్లో ధర ఇంతకంటే తక్కువగా ఉండటంతో ఉత్పత్తి వ్యయం కూడా రాక పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. యుద్ధ మేఘా లు త్వరగా తొలగని పక్షంలో రానున్న రోజుల్లో ఎగుమతులు మరింతగా దెబ్బ తిని ధరలు ఇంకా పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఇప్పటికే వేసవి కాలం సమీపిస్తుండటం గుడ్ల వినియోగం కాస్త తగ్గే అవకాశం లేకపోలేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ యజమాను ల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వాలు స్పందించి ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని, తమను ఆదుకోవా లని పౌల్ట్రీ యజమానులు కోరుతున్నారు.