
మనతెలంగాణ/హైదరాబాద్:ఎలాంటి విధ్వంసం లే కుండా అరాచకం లేకుండా మూసీని అభివృద్ధి చే య వచ్చు అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి ఆ ర్ అ న్నారు. మూసీ అభివృద్ధి అంశంలో ఒ క్క ఇల్లు కూల్చే అవసరం లేనిది బిఆర్‌ఎస్ మోడల్ అయితే, కాంగ్రెస్‌ది లక్షన్నర ఇండ్లను కూల్చే బు ల్డోజర్ మోడల్ మండిప డ్డారు. బిఆర్‌ఎస్ మోడల్ లో వికాసం ఉంటే కాంగ్రెస్ విధానాల్లో విధ్వంసం ఉన్నదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ మోడల్ పరిపాలన ఆపాలని హెచ్చరించారు. మూ సీ అభివృద్ధి పేరిట కాంగ్రెస్ చేస్తున్న అరాచకాన్ని అవినీతిని ఆపాలని, త మ అవినీతి సొమ్ముల కోసం లక్షల మంది పేదల ఇం డ్లు కూలగొట్టే ప్రయత్నం మానుకోవాలనిపేర్కొన్నారు.
నగరంలోని నాగోల్‌లో గురువారం మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మహమూద్ అలీ,తలసాని శ్రీని వాస్ యాదవ్, ఎంఎల్‌ఎలు పేర్కొన్నారు. నగరంలోని నాగోల్‌లో గురువారం మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మహమూద్ అలీ,తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌ఎలు ముఠా గోపాల్,సుదీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, ఎంఎల్‌సి వాణి దేవి, ఇతర బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్‌టిపి)ని పరిశీలించారు. తర్వాత నాగోల్ బ్రిడ్జి వద్ద గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన మూసి మోడల్‌ని పరిశీలించి అక్కడ మూసీ ప్రాజెక్టు బాధిత కుటుంబాలతో మాట్లాడారు. తీవ్రమైన ఆవేదనలో ఉన్న బాధిత కుటుంబాలను ఓదార్చారు.
వారికి బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, నగరంలో మూసీ ప్రాజెక్టు పేరిట లక్షన్నర మంది ఇళ్లను కూలగొట్టే కుట్ర చేస్తున్న ప్రభుత్వ చర్యలపై మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కేవలం తన అవినీతి కోసం, ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల సంపాదన కోసం లక్షన్నర మంది పేదల ఇళ్లను కూలగొడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ప్రతి ఒక్క బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, కెసిఆర్ సైనికుడు కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం లేకుండా కూడా మూసీని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నదని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐదున్నర కిలోమీటర్ల మేర ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా మూసీని నాగోల్ ప్రాంతంలో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఎన్నికల ముందు పేదలకు అండగా ఉంటామని, వారికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి వారిని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజ్యాన్ని తెచ్చారు
నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు తమ ఇళ్లను కూలగొడుతుందో ప్రభుత్వం అని ప్రజలు భయం భయంగా బతుకుతున్నారని కెటిఆర్ అన్నారు. ’ఇందిరమ్మ రాజ్యం’ తెస్తామని చెప్పి ’బుల్డోజర్ రాజ్యాన్ని’ తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట నగరంలో సృష్టిస్తున్న విధ్వంసాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది మూసీ బ్యూటిఫికేషన్ కాదు అని, అది లూటిఫికేషన్ అంటూ విమర్శలు చేశారు. కేవలం 16 వేల కోట్ల రూపాయలతో మొత్తం మురుగు నీటిని శుద్ధి చేయడంతో పాటు కొండపోచమ్మ నుంచి మంచి నీళ్లను మూసీలోకి తీసుకురావడం, రెండు వైపులా స్కైవేల నిర్మాణం వంటి అన్ని కార్యక్రమాలతో కూడిన సమగ్రమైన డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డిపిఆర్) ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నదని తెలిపారు.
కానీ, వేల కోట్ల రూపాయల అవినీతి కోసం రేవంత్ రెడ్డి ఈ మూసీ ప్రాజెక్టును ఎత్తుకున్నారని ఆరోపించారు. 16 వేల కోట్లతో జరిగే ప్రాజెక్టుని లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణకు తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. అయితే, ఆ ప్రాజెక్టు పేరుతో మాత్రం లక్షల మంది జీవితాలను ఆగం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్వయంగా రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చెరువులలో ఇళ్లు కట్టుకుని ఉన్నారని చెప్పారు. అలాంటి వారిని ముట్టుకోకుండా పేద ప్రజలకు మూసీ ఒడ్డున ఉన్నారంటూ.. పెంచిన బఫర్ జోన్ నిర్ణయాల వల్ల వారి ఇళ్లు కూలగొడతామని బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు.
ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి డిపిఆర్ సిద్ధం చేయకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా కేవలం ఇళ్లకు రెడ్ మార్కులు వేస్తూ ప్రజల పైన కేసులు పెడుతూ బెదిరింపులకు దిగుతూ భయపెట్టిస్తున్నారని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పేద ప్రజల ఇళ్లకు నష్టం జరగకుండా మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన అవినీతికి వాడుకుంటామంటే అడ్డుకొని తీరుతామని కెటిఆర్ హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పనులను తమకు అప్పగిస్తే రూ.16 వేల కోట్లకే చేసి చూపిస్తామని అన్నారు. పైగా ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తామని అన్నారు. హామీల అమలు కోసమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కెటిఆర్ సవాల్ విసిరారు.