
టెహరాన్: మధ్యప్రాచ్య యుద్ధం వేళ ఇరా న్ భారత్ పట్ల మిత్రధర్మం పాటించింది. హర్మూజ్ జలసంధి నుంచి కేవలం అమెరి కా, ఇజ్రాయెల్ , యూరప్ దేశాల నౌకల ను అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు గురువారం ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ దళాలు ఓ ప్రకటన వెలువరించాయి. ఈ ప్రకటనతో ఈ అత్యంత కీలకమైన చమురు రవాణా జలమార్గంలో భారతీయ నౌకల రాకపోకలకు ఎటువంటి ఆటంకాలు ఉండవని స్పష్టం అ యింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్రపక్ష దేశాలకు నో ఎంట్రీ అని తెలియచేశారు. ఈ విషయం భారతదేశానికి శుభవార్త అ యింది. ఈ మధ్యరోజుల్లో ఈ ప్రాంతం చ మురు నౌకల రాకపోకలకు ముప్పుగా మా రింది. అనేక నౌకలపై దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇరాన్ సేనల కనుసన్నల్లోనే సాగుతున్నాయనేది ప్రపంచ స్థా యి బహిరంగ రహస్యం అయింది. ఇరాన్ అధికారిక ప్రకటనను అక్కడి అధికారిక వా ర్తా ప్రసార సంస్థ ఐఆర్‌ఐబి తెలియచేసిం ది. ఇప్పటి ప్రకటనతో ఈ జల మార్గంలో చమురు నౌకల
ప్రయాణాలపై అనిశ్చితత, డోలాయమాన పరిస్థితి తొలిగిపోయింది. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటి కటుతరమైన పరస్పర కవ్వింపు చర్యలు, పరస్పర దాడులతో ఈ ప్రాంతంలో దాదాపుగా అన్ని రకాల వాణిజ్య నౌకల కదలికలు నిలిచిపోయాయి. ఈ దశలో భారతదేశం వంటి అత్యధిక స్థాయి చమురు వాడకాల అవసరం ఉన్న బారత్ వంటి దేశాలకు ఈ ప్రకటన పెద్ద రిలీఫ్ ఇచ్చింది. చమురు కోసం ఇతర ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్న భారత్‌కు ఇక ఈ బెడద తప్పనుంది. ఈ జలమార్గం తమ ఆధీనంలో ఉందని, దీనిపై తమకే హక్కులు ఉన్నాయని, ఈ ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలు తిరిగితే తమ దాడులు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. పైగా ఇక్కడ ఇరాన్ తరఫున హైతీ ఇతర మిలిటెంటు బృందాల నాటుపడవలు సంచరిస్తున్నాయి. అయితే ఇప్పుడు వీటి భయాలు లేకుండా భారత్‌కు చెందిన నౌకలు ఇక్కడ తమ నిర్ణీత గమ్యానికి చేరుకునేందుకు వీలేర్పడింది. ముందుగా ఈ ప్రాంతం మీదుగా కేవలం చైనా జెండాలతోతిరిగే నౌకలను అనుమతిస్తామని ఇరాన్ తెలిపింది. తమ పట్ల చైనా సంఘీభావానికి గుర్తింపుగా ఈ చర్యకు దిగారు.
23వేల మంది భారతీయ నావికుల కదలిక
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షల దశలో దాదాపు 23000 మంది భారతీయ నావికులు గల్ఫ్ ప్రాంతంలో నౌకారవాణా లేకపోవడంతో చిక్కుపడ్డారు. ఇక ఈ ప్రాంతంలో దాదాపుగా 36 వరకూ భారతీయ జెండాలతో కూడిన చమురు రవాణా నౌకలు ఉన్నాయని వెబ్‌సైట్‌తో స్పష్టం అయింది. వీటిలో ఏడు భారత నౌకా రవాణా సంస్థకు చెందిన నౌకలు ఉన్నాయి. ఈ ప్రాంతం వెలుపల భారీ సంఖ్యలో చమురు నౌకల గుంపులు ఆరు క్రూడాయిల్ ట్యాంకర్లు, 1 చమురు ట్యాంకర్, 1 ఎన్‌ఎన్‌జి నౌక, మూడు కంటైనర్ షిప్‌లు, ఇతరత్రా జలరవాణా వాహనాలు ఉన్నాయని వెబ్‌సైట్‌తో స్పష్టం అయింది. హర్మూజ్ జలసంధి మార్గం ప్రారంభ ప్రదేశంలో వందలాదిగా చమురు నౌకలు ఆగిపోయి ఉన్న విషయం మెరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రత్యేకించి పలు చమురు ట్యాంకర్ నౌకలు కువైట్ ఉత్తరంలో, దుబాయ్ తీరం వెంండి నిలిచిఉన్నాయి. ఇరాన్‌కు చెందిన సొంత వాణిజ్య నౌకలు ఇప్పుడు బందర్ అబ్బాస్ రేవు వద్ద లంగర్ వేసుకుని ఉన్నాయి.