
అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌కు సంబంధించిన మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు పాల్గొంటాయి. లీగ్ దశ మ్యాచ్‌లు మార్చి 8 నుంచి ప్రారంభమై, ఫైనల్ మ్యాచ్ మార్చి 14న జరుగనుంది.
పూల్-ఏలో జట్లు: ఇంగ్లాండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా. పూల్-బీలో జట్లు : భారతదేశం, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్
లీగ్ దశ మ్యాచ్‌లు : మార్చి 8 (ఆదివారం) మధ్యాహ్నం 12:45 – ఇంగ్లాండ్ వర్సెస్ ఇటలీ. మధ్యాహ్నం 3:00 – కొరియా వర్సెస్ ఆస్ట్రియా, సాయంత్రం 5:15 – స్కాట్లాండ్ వర్సెస్ వేల్స్, రాత్రి 7:30 – భారతదేశం వర్సెస్ ఉరుగ్వే, మార్చి 9 (సోమవారం) మధ్యాహ్నం 12:45 – ఇటలీ వర్సెస్ ఆస్ట్రియా, మధ్యాహ్న ం 3:00 – కొరియా vs ఇంగ్లాండ్, సాయంత్రం 5:15 – ఉరుగ్వే వర్సెస్ వేల్స్, రాత్రి 7:30 – స్కాట్లాండ్ వర్సెస్ భారతదేశం, మార్చి 10 – విశ్రాంతి రోజు. మార్చి 11 (బుధవారం) మధ్యాహ్నం 12:45 – ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రియా, మధ్యాహ్నం 3:00 – ఇటలీ వర్సెస్ కొరియా, సాయంత్రం 5:15 – ఉరుగ్వే వర్సెస్ స్కాట్లాండ్, రాత్రి 7:30 – భారతదేశం వర్సెస్ వేల్స్, మార్చి 12 – విశ్రాంతి రోజు.
నాకౌట్ మ్యాచ్‌లు : మార్చి 13 (శుక్రవారం) మధ్యాహ్నం 12:45 – పూల్ ఏలో 3వ స్థానం vs పూల్ బీలో 4వ స్థానం మధ్యాహ్నం 3:00 – పూల్ బీలో 3వ స్థానం vs పూల్ ఏలో 4వ స్థానం, సాయంత్రం 5:15 – సెమీ ఫైనల్: పూల్ ఏలో 1వ స్థానం vs పూల్ బీలో 2వ స్థానం, రాత్రి 7:30 – సెమీ ఫైనల్ : పూల్ బీలో 1వ స్థానం vs పూల్ ఏలో 2వ స్థానం, మార్చి 14 (శనివారం) మధ్యాహ్నం 12:45 – 7వ స్థానం మ్యాచ్,
మధ్యాహ్నం 3:00 – 5వ స్థానం మ్యాచ్, సాయంత్రం 5:15 – 3వ స్థానం మ్యాచ్, రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్.
ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు పూల్-బీలో స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లతో పోటీ పడనుంది. లీగ్ దశలో అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.