Reading Time: < 1 minute

మధ్యప్రాచ్యం , విస్తారిత గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో పరస్పర అణు స్థావరాల ధ్వంసాల హెచ్చరికలు తీవ్రతరం అయ్యాయి. ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత కీలకమైన డిమోనా అణు స్థావరంపై దాడికి దిగుతామని గురువారం ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌లో నూతన నాయకత్వ ఎంపిక ప్రక్రియ భగ్నానికి అమెరికా చేస్తున్న కుట్రలపై ఇరాన్ స్పందించింది. ఇప్పటికైనా ట్రంప్, నెతన్యాహులు ఈ కుట్రలు ఆపకపోతే తమ బలగాలు డిమోనా అణు స్థావర కార్యకలాపాలను దెబ్బతీస్తామని, దీని పరిణామాలు తీవ్రస్థాయి లో ఉంటాయని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ వర్గాలు ప్రకటించాయి. ఇక మరో వైపు ఇరాన్‌లోని అత్యంత కీలకమైన

అణు స్థావరాలను దెబ్బతీసేందుకు ఇప్పటికే యత్నించి వెనుకడుగు వేసిన అమెరికా ఇప్పుడు ఈ దిశలో తిరిగి కదలికలకు దిగింది. మరో వైపు ఫ్రాన్స్‌కు చెందిన అణుశక్తి సంచాలక యుద్ధ నౌక ఇప్పుడు అమెరికా మిత్రదేశాలకు సాయం కోసం సముద్ర మార్గాలలో తిష్టవేసుకుని ఉంది. ఇరాన్‌ను భారీ స్థాయిలో దెబ్బతీసేందుకు అత్యంత తీవ్రస్థాయి , ఇంతవరకూ ఎప్పుడూ వాడని అణ్వాయుధాలను రంగంలోకి దింపాలని ట్రంప్ తమ అత్యంత కీలక వ్యూహానికి పదును పెడుతున్నట్లు ఇరాన్ పసిగట్టింది. ప్కరస్తుత పరిణామాలతో అణు దాడుల ప్రకంపనలు ప్రపంచానికి సెగలు పుట్టిస్తున్నాయి.