Reading Time: 2 minutes

రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ bsc.telangana.gov.in, హాల్ టికెట్లు పొందవచ్చు. అలాగే విద్యార్థులు వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద నుంచి కూడా ఈ పరీక్ష హాల్ టికెట్లను విద్యార్థులు పొందవచ్చు. దానిని ప్రింట్ తీసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా గురువారం సాయంత్రం వరకు 29,790 మంది విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 2,71,564 మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈసారి 5.27 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష హాజరుకానున్నారు. ఈసారి కొత్తగా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాంతో విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది.. ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రానికి వెళ్లవచ్చు.

హాల్‌టికెట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే హెచ్‌ఎంల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. సైన్స్ పరీక్షలు రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, 7న బయాలజీ, ఏప్రిల్ 13 సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్ 1 భాషా పరీక్ష, 16న ఒకేషనల్ కోర్సు పేపర్ 2 భాషా పరీక్ష జరుగనుంది. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రం(ఆబ్జెక్టివ్ పేపర్) పార్ట్ బి పరీక్ష చివరి అర గంట ముందు ఇస్తారు. విద్యార్థులు ఆ 30 నిమిషాల్లోనే అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్‌కు మాత్రం పార్ట్ బి కూడా పార్ట్ ఎ కూడా ఇస్తారు.

తెలంగాణలో వాట్సప్‌లో ఇలా డౌన్‌లోడ్..

8096958096 వాట్సాప్ నెంబర్‌కు హాయ్ (Hi) అని సందేశం చేయండి.

మీ ఫోన్‌కి వెల్‌కమ్‌టూ మీ సేవ అని వస్తుంది.

చాట్‌లో SSC hall Ticket march -2026 అని టైప్ చేసి మెసేజ్ చేయండి.