Reading Time: < 1 minute

రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి డిపిఆర్ సిద్ధం చేయకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా కేవలం ఇళ్లకు రెడ్ మార్కులు వేస్తూ ప్రజల పైన కేసులు పెడుతూ బెదిరింపులకు దిగుతూ భయపెట్టిస్తున్నారని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పేద ప్రజల ఇళ్లకు నష్టం జరగకుండా మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన అవినీతికి వాడుకుంటామంటే అడ్డుకొని తీరుతామని కెటిఆర్ హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పనులను తమకు అప్పగిస్తే రూ.16 వేల కోట్లకే చేసి చూపిస్తామని అన్నారు. పైగా ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తామని అన్నారు. హామీల అమలు కోసమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కెటిఆర్ సవాల్ విసిరారు.