Reading Time: < 1 minute

ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు సమవుజ్జీలైన జట్ల మధ్య జరుగుతున్న పోరు ఇది కావడంతో ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. రెహన్ స్థానంలో జెమీ ఓవర్‌టన్‌ను జట్టులోకి తీసుకుంది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.

తుది జట్లు:

ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జాస్ బట్లర్(కీపర్), హారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెతెల్, టామ్ బాన్‌టన్, శామ్ కర్రన్, విల్ జాక్స్, జెమీ ఓవర్‌టన్, లైమ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్.

భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.