
హైదరాబాద్: నగరంలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏడు అంతస్థుల భవన నిర్మాణంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 10 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. కార్మికులు ఐదో అంతస్థు నుంచి జారి పడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్లాస్టరింగ్ పని చేస్తూ.. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.