Reading Time: < 1 minute

అమరావతి: ప్రస్తుతం చాలా దేశాల్లో జనాబా పెరిగిపోయిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్రాసింగ్ కు ప్రధాన్యత ఇచ్చాం అని అన్నారు. ఈ సందర్భంగా పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీలపై అసెంబ్లీలో సిఎం ప్రకటన చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెడుతున్నామని తెలియజేశారు. నెల రోజుల పాటు అందరి అభిప్రాయాలు సేకరిస్తామని, అందుకే ప్రత్యేక పాలసీని తెస్తున్నామని అన్నారు. దేశ సగటున కంటే మన రాష్ట్ర జనాభా సగటు తక్కువగా ఉందని, 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయిందని, పనిచేసే వారి సంఖ్య భారీగా పడిపోయిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.