Reading Time: < 1 minute

ముంబై: టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు.. అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటి వాడయ్యాడు. తన ప్రేయసి సానియా ఛందోక్‌ను అర్జున్ టెండూల్కర్ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు పలువురు స్టార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సానియా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఆమె కూడా వ్యాపారవేత్తే. ముంబైలోని మిస్టర్ పాస్ పెట్‌ స్పా సంస్థను నడుపుతోంది. చాలా సంవత్సరాల నుంచి సచిన్ కుమార్తె సారాతో సానియాకు అనుబంధం ఉంది. కాగా ఈ వివాహానికి ఐసిసి ఛైర్మన్ జై షా, ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుటుంబం, ఎపి మంత్రి నారా లోకేశ్, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, టీం ఇండియా మాజీ క్రికెటర్లు ఎం.ఎస్.ధోనీ, ఇర్ఫాన్ పఠాన్, యుసుఫ్ పఠాన్, సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా, మహమ్మద్ కైఫ్ తదితరులు హాజరై సందడి చేశారు.