
హైదరాబాద్: తన కొత్త సినిమా ‘వృషకర్మ’ ఈవెంట్‌లో హీరో నాగచైతన్య జారి కిందపడ్డారు. గురువారం నగరంలోని ప్రసాద్స్ ఐమాక్స్‌లోని పిసిఎక్స్ స్క్రీన్‌లో ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొనేందుకు చిత్ర యూనిట్ చిట్‌చాట్‌కి సిద్ధమయ్యారు. వాళ్లు కూర్చొనేందుకు కుర్చీలు తీసుకొచ్చారు. అయితే నాగచైతన్య కుర్చొగానే ఆ కుర్చీ వంగిపోయింది. దీంతో ఆయన వెనక్కి పడిపోయారు. చిత్ర బృందం, అభిమానులు ఆందోళన చెందారు. చైతన్యకు ఏమైనా దెబ్బలు తగిలి ఉంటాయో అని కంగారు పడ్డారు. అప్పటికే తేరుకున్న చైతన్య.. పక్కనే ఉన్న దర్శకుడు కార్తీక్ దండు సహాయంతో లేచి మరో కుర్చీలో కూర్చున్నారు. సిబ్బందిపై చైతన్య కాస్త అసహనం వ్యక్తం చేస్తూనే.. వృషకర్మ చిత్రం గురించి మీడియా అడిగి ప్రశ్నలకు సమాధాలు ఇచ్చారు.