Reading Time: < 1 minute

హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడిన రెండు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం అభిషేక్ మను సింఘ్వీ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబు నేతృత్వంలో ఇద్దరూ ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు.