Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్ర రాష్ట్రానికి చెందిన విజయనగరంలో భూగర్భ కేబుల్ పై ప్రతిపాదన పరిశీలిస్తున్నామని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అధిక లోడ్ ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం అని అన్నారు. ఎపి అసెంబ్లీలో విద్యుత్ సబ్స్ స్టేషన్ల ఏర్పాటుపై టిడిపి ఎమ్మెల్యే పూసపాటి అతిది విజయలక్ష్మి ప్రశ్నకు గొట్టిపాటి సమాధానం చెప్పారు. 200కు పైగా 33/11 కెవి సబ్ స్టేషన్ల డిమాండ్ ఉందని.. ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో 400 కెవి,200 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని గొట్టిపాటి తెలియజేశారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతోందని, పరిశ్రమలు, వ్యవసాయం కనెక్షన్లు పెరుగుతున్నాయని అన్నారు. రోజుకు 280 మిలియన్ యూనిట్ల వినియోగానికి చేరుకునే అవకాశం ఉందని, విద్యుత్ లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్య లేకుండా చూడాలని తమ లక్ష్యం అని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.