Reading Time: < 1 minute

పవర్‌గ్రిడ్‌లో 188 అప్రెంటిస్ పోస్టులు: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసినోళ్లకు మంచి ఛాన్స్ !

Caption of Image.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పవర్‌గ్రిడ్) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 2న ప్రారంభమై మార్చి 11న ముగుస్తుంది.

 ఖాళీలు: 188

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ, మూడేళ్ల డిప్లొమా, బీఈ/ బీటెక్ , బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంబీఏ/ పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఇన్ సోషల్ వర్క్, బీఏ హిందీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్​డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ALSO READ : PGIMERలో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ

దరఖాస్తు ప్రారంభం: మార్చి 2

చివరి తేదీ: మార్చి 11

ఎంపిక విధానం:  షార్ట్​లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ www.powergrid.in ను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.