Reading Time: < 1 minute

హైదరాబాద్ నార్సింగిలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్..

Caption of Image.

 హైదరాబాద్ నార్సింగిలో  అక్రమంగా నిర్మిస్తోన్న వెంచర్ పై చర్యలు తీసుకోవాలని నిరసనకు దిగిన  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను  పోలీసులు అరెస్ట్ చేశారు.  హైడ్రా కమిషనర్ రంగనాథ్  వచ్చే వరకు నిరసన విరమించేది లేదని మధ్యాహ్నం నుంచి కవిత అక్కడే బైఠాయించారు.  చీకటి కావడంతో   వెంచర్ నిర్వాహకులు  కావాలనే లైట్లు ఆఫ్ చేశారని  గేట్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు జాగృతి కార్యకర్తలు. దీంతో  పోలీసులకు జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.  నిరసన చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్  చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ తరలించారు.

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన కవిత.. మూసి ప్రక్షాళన పేరుతో అనేక భవనాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని ఆరోపించారు. మూసి సుందరీకరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ బొమ్మ పెడతామని చెప్పి మధ్యతరగతి ప్రజల ఇళ్ల మీదికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. మూసీ నదిలో అక్రమంగా నిర్మిస్తున్న ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడట్లేదా. పేదలకు ఒక  న్యాయం పెద్దలకు ఒక్క న్యాయమా..?. ప్రభుత్వం అపార్ట్మెంట్ వాసులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.  హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు పే పెదవాళ్లంటే అలుసుగా ఉంది. ఈ నిర్మాణం అక్రమం కాదు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి చెప్పాలి.. ఒకవేళ ఇది సక్రమమైన నిర్మాణం అంటే బాధిత కుటుంబాలకు ఇందులో ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.