Reading Time: < 1 minute

ఆకాశంలో బ్లడ్ మూన్..చివరి దశలో తెలంగాణలో కనువిందు

Caption of Image.

ఆకాశంలో బ్లడ్​ మూన్​..మంగళవారం ఆకాశంలో అద్బుతం ఆవిష్కృతమైంది. చంద్రగ్రహణం సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా బ్లడ్​ మూన్​ కనువిందు చేసింది. ఇండియాలో  ప్రారంభంలో కనిపించని గ్రహణం..చివర్లో సాక్షాత్కరించింది అద్బుతం. గ్రహణం చివర్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్లడ్​ మూన్​ చూసే అవకాశం లభించింది. ఎరుపురంగులో ఉన్న చంద్రున్ని చూసేందుకు  జనం ఆసక్తి చూపారు.దాదాపు 25 నిమిషాల పాటు గ్రహణాన్ని వీక్షించారు. తెలంగాణలోని కరీంనగర్, జగిత్యాల జిల్లాలో చంద్రగ్రహణం ముగింపు దృశ్యాలు అద్బుతంగా కనిపించాయి. 

పుబ్బ నక్షత్రంలో సింహరాశిలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. మధ్యామ్నం 3.20 గంటలకు ప్రారంభం అయిన గ్రహణం.. సాయంత్రం 6.47 గంటలకు ముగిసింది. మన దేశంలో కోల్​ కతా, ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్​, బెంగళూరు, అహ్మదాబాద్​, పాట్నా, భువనేశ్వర్​, గౌహతి, ఇంఫాల్​, షిల్లాంగ్​, కోహిమా, ఇటానగర్​ ప్రాంతాల్లో గ్రహణం సంపూర్ణంగా కనిపించింది. చంద్రగ్రహణం సందర్బంగా ఏర్పడిన బ్లడ్​ మూన్​ ను ప్రత్యక్షంగా, డీఎస్​ ఎల్​ ఆర్​ కెమెరాలు, బైనాక్యులర్లు, చిన్న టెలిస్కోపుల  ద్వారా బ్లడ్​ మూన్​ ను ప్రజలు వీక్షించారు. 

►ALSO READ | గ్రహణం ఎఫెక్ట్.. నిల్వ ఆహార పదార్దాలపై దర్భ(గరిక)ను వేయండి..గ్రహణ ప్రభావం ఉండదు..ఇంట్లో ఎక్కడెక్కడ..ఏ సమయంలో వేయాలి..! 

©️ VIL Media Pvt Ltd.