Reading Time: < 1 minute
Sri Lankan Cricket Legend Kumar Sangakkara Father Kshema Sangakkara Passes Away

కొన్ని రోజుల క్రితం భారత యువ ప్లేయర్ రింకూ సింగ్ తండ్రి క్యా్న్సర్ వ్యాధిన బారినపడి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో లెజెండరీ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార్ సంగక్కర తండ్రి క్షేమ సంగక్కర కన్నుమూశారు. క్షేమ ప్రఖ్యాత న్యాయవాది. కాండీలో ప్రముఖ వ్యక్తి. ఆయన క్రికెట్ ప్రపంచానికి, శ్రీలంకకు ప్రపంచంలోని గొప్ప క్రికెటర్లలో ఒకరైన కుమార్ సంగక్కరను అందించారు. సంగక్కర కుటుంబం ఈ విచారకరమైన వార్తను అభిమానులతో పంచుకుంది. మార్చి 4న ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించింది.

Also Read:HDFC: కస్టమర్లకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుండి న్యూ రూల్స్.. లాకర్లు, ATM, UPI రూల్స్ లో మార్పులు..

కుమార్ సంగక్కర తండ్రి ప్రొఫెషనల్ క్రికెటర్ కాకపోయినా, కుమార్ మొదటి కోచ్. అతను తన కొడుకు పట్ల చాలా క్రమశిక్షణతో ఉండేవాడు, ప్రతిరోజూ గంటల తరబడి సంగక్కర, అతని సోదరులకు శిక్షణ ఇచ్చాడు. కుమార్ సంగక్కర కుటుంబం అతని మరణాన్ని ధృవీకరించింది. కుమార్ సంగక్కరను శ్రీలంక క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్ళలో ఒకరిగా తీర్చిదిద్దడంలో అతని తండ్రి కీలక పాత్ర పోషించారు. సంగక్కర తన పదవీ విరమణ ప్రసంగంలో తన తండ్రికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. కుమార్ సంగక్కర ప్రస్తుతం ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్, డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని గమనించాలి. కుమార్ సంగక్కర తండ్రి మరణం తర్వాత, సోషల్ మీడియా క్రీడా అభిమానుల దుఃఖంతో నిండిపోయింది.