
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎసిపి వెంకటగిరికి మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆరు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. నంది నగర్‌లోని తన ఇంటికి నోటీసు అంటించడం ద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని అన్నారు. అయినప్పటికీ బాధ్యతాయు త పౌరుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా విచారణ కు సహకరిస్తానని, ఆదివారం (ఫిబ్రవరి 1) మధ్యాహ్నం 3 గం టలకు విచారణకు సిద్ధమని తెలిపారు.అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని, కానీ బాధ్యతాయుత పౌరుడిగా విచారణకు హాజరవుతానని అన్నారు. నందినగర్‌లో తన ని వాసం గోడపై నోటీసు అతికించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని లే ఖలో పేర్కొన్నారు. 65ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దనే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. తన ప్రస్తుత ని వాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే విచారించాలని ఆ లేఖలో స్ప ష్టం చేశారు. అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎర్రవల్లిలో విచారించలేమని చెప్పడం సరికాదని అన్నారు. నోటీసు ఇ చ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అన్నదే ముఖ్యం అ ని, తాను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నానని తెలిపారు.ఎన్నికల అఫిడవిట్‌లోని చిరునామాకు, సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ కేసు తీర్పును లేఖలో ఉటంకించారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న చిరునామాకు, సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద జారీ చేసే నోటీసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం నివసిస్తున్న చిరునామాలోనే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం స్పష్టంగా చెబుతోందని తెలిపారు. వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధమైన పద్ధతి కాదని, చట్టం నిర్దేశించిన రీతిలోనే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. సిఆర్‌పిసి 160 నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలని..కానీ.. మీరు కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని జూబ్లీహిల్స్ ఎసిపిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అన్నారు. భవిష్యత్తు నోటీసులన్నీ ఎర్రవల్లికే పంపాలని తాను చెప్పినప్పటికీ దానిని విస్మరించారని పేర్కొన్నారు. కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని వీడీ మూర్తి కేసు తీర్పును లేఖలో కెసిఆర్ ప్రస్తావించారు. ఆ తీర్పు ప్రకారం ఆ పోలీసు స్టేషన్ పరిధి లేదా పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే సిఆర్‌పిసి 160 కింద నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని అన్నారు. పోలీసుల చర్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నన్ను విచారించే అధికార పరిధి జూబ్లీహిల్స్ ఎసిపికి లేదు
జూబ్లీహిల్స్ ఎసిపికి తనను విచారించే అధికార పరిధి లేదని కెసిఆర్ పేర్కొన్నారు. తాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ, పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ నివసించడం లేదని, కాబట్టి మీకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదని జూబ్లీహిల్స్ ఎసిపిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఈ నోటీసుతో తనను కట్టడి చేసే అధికారం లేదని అన్నారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో, అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎర్రవల్లిలో విచారించలేమని మీరు చెప్పడం సరికాదు. నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అన్నదే ముఖ్యం. నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నాను అన్నది నిర్వివాద అంశం.
అక్కడే నా స్టేట్‌మెంట్ రికార్డ్ చేయవలసిన బాధ్యత మీపై ఉన్నది’ అని పేర్కొన్నారు. నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రస్తుతం నివసిస్తున్న చోట విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం చెబుతోందని అన్నారు. హరీష్ రావు అఫిడవిట్‌లో సిద్దిపేట అని చిరునామా ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు. నోటీసుల విషయంలో పోలీసులు వేర్వేరు ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. ఈ తరహా చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని హెచ్చరించారు. పోలీసుల తీరు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నోటీసులన్నింటినీ ఎర్రవల్లిలోని తన చిరునామాకే పంపించాలని పోలీసులకు కెసిఆర్ సిట్ అధికారులను విజ్ఞప్తి చేశారు.