Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ మాజీ సిఎం కెసిఆర్‌కు సిట్ జారీ చేసిన నోటీసులపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆగ్ర హం వ్యక్తం చేశారు. నందినగర్‌లోని కెసిఆర్ నివా సం ముందు గోడకు నోటీసులు అతికించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. గోడకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందారని సిఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంటని ప్రశ్నించారు. సిట్ అధికారులకు కెసిఆర్ స్వయంగా తన చిరునామాను అందించారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గోడకు నోటీసులు అంటించడం పైశాచిక చర్యేన ని మండిపడ్డారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు.

65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారు ఉంటున్న ఇంటికే వెళ్లి విచారించాలని ని బంధనలు చెబుతున్నాయని తెలిపారు. ఈ నిబంధనను కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారని ఆ గ్రహం వ్యక్తం చేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా..లేక ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మల్లా మారి ప్రతిపక్ష నేతలను వే ధించడమే పనిగా పెట్టుకున్నారా అంటూ పోలీసులను నిలదీశారు. చట్టం మీద, న్యాయం మీద, ధ ర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మా కు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నదని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఈ అ క్రమ కేసులన్నీ చేధిస్తాం…ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని కెటిఆర్ తెలిపారు. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

విచారణకు సహకరిస్తానని చెప్పినా కక్ష సాధింపులు దేనికి?: తలసాని

రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందో సర్కస్ నడుస్తుం దో ఎవ్వరికీ అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీ నివాస యాదవ్ విమర్శించారు. రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని, అందరినీ అక్కున చేర్చుకుని సంక్షేమ ఫలాలు అందించిన గొప్ప నేత అని పేర్కొన్నారు. ఒక్కడిగా రాష్ట్ర సాధనకు బయలుదేరి అందరినీ ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని తెచ్చిన నేత కెసిఆర్ అని, అలాంటి సీనియర్ రాజకీయ వేత్తను కాంగ్రెస్ కక్ష సాధింపులను ప్రపంచమంతా చూస్తోందని అన్నారు. కెసిఆర్ ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసు అని, మం త్రులు కూడా అక్కడికి వెళ్లారని తెలిపారు. సిట్ అధికారులు మాత్రం నందినగర్ నివాసానికి వచ్చి గోడకు నోటిస్ అతికించి వెళ్లారని మండిపడ్డారు. చట్టాన్ని గౌరవిస్తా విచారణకు సహకరిస్తానని కెసిఆర్ చెప్పినా ఈ కక్ష సాధింపులు దేనికి? అని ప్రశ్నించారు. కెసిఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే విచారణపై స్టే వచ్చేది అని, అయినా చట్టాన్ని గౌరవించి కెసిఆర్ విచారణకు హాజరవుతున్నారని చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గ్రహించాలని హితవు పలికారు. మున్సిపల్ ఎన్నికలను గందరగోళంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోంది : మధుసూదనాచారి

కెసిఆర్‌కు సిట్ పేరిట నోటీసులు ఇచ్చి అత్యంత హేయమైన,దుర్మార్గమైన చర్యలకు రాష్ట్ర ప్రభు త్వం పాల్పడుతోందని బిఆర్‌ఎస్ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచా రి మండిపడ్డారు. కెసిఆర్ ఒక్క బిఆర్‌ఎస్‌కు మా త్రమే నాయకుడు కాదు అని, యావత్ తెలంగాణ సమాజానికి నాయకుడు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతిని వీరోచిత జాతిగా మార్చిన నాయకుడు కెసిఆర్ అని కొనియాడారు. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పరిచి చేతికిస్తే విధ్వం సం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.