
బళ్లారి: గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పుల కలకలం సృష్టించాయి. కర్నాటక రాష్ట్రం బళ్లారిలో ఎంఎల్ఎ భరత్‌రెడ్డి సన్నిహితుడు సతీష్‌రెడ్డి కాల్పులు జరిపాడు. గన్‌మెన్ తుపాకీ లాక్కుని సత్తీష్ రెడ్డి ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. వెంటనే జనార్థన్ రెడ్డి అప్రమత్తమై తప్పించుకున్నాడు. ఇరువర్గాల పరస్పర కాల్పులు జరుపుకోవడంతో ఒకరు మృతి చెందారు. సతీష్‌రెడ్డికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. బళ్లారిలో కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్ధన్‌రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్‌రెడ్డితో సహా11 మందిపై బ్రూస్‌పేట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటుతోనే వివాదం చెలరేగినట్టు సమాచారం.