Reading Time: < 1 minute

హైదరాబాద్: న్యూ ఇయర్ వేళ హైదరాబాదులో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసిన మందుబాబులు లెక్కచేయలేదు. మందుబాబులు తాగి రోడ్డు ఎక్కి పోలీసులకు చుక్కలు చూపించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో రోడ్డుపై పడుకుని ఓ మందుబాబు హల్ చల్ చేశారు. కానిస్టేబుల్ తనను కొట్టాడంటూ రోడ్డుపై మందుబాబు పడుకున్నాడు. బైక్ తాను నడపకున్నా కానిస్టేబుల్ కొట్టాడంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. మద్యం మత్తులో కాసేపు రోడ్డుపై పడుకుని వ్యక్తి హల్ చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకొని పిఎస్ కు తరలించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులకు మందుబాబును అప్పగించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి మాల్ లోని డిజె ప్లేయర్ కు డ్రగ్స్ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. పోలీసులు అర్ధరాత్రి టెస్టులు నిర్వహించగా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. డీజే ప్లేయర్ కు డ్రగ్స్ అమ్మిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.