
తిరువనంతపురం: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత మహిళ జట్టుతో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో శ్రీలంక మహిళ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని శ్రీలంక అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక, భారత్ జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. శ్రీలంక జట్టులోకి ఇనోక, మాల్కీ రాగా, భారత జట్టులోకి కమలినీ ఆరంగేట్రం చేయగా, స్నేహ్ రానా జట్టులోకి వచ్చింది.