Reading Time: 2 minutes

ఏటీఎం పిన్ వెనుక ఇంత కథ ఉందా..! ప్రపంచాన్ని మార్చిన ఐడియా.. అస్సలు నమ్మలేరు!

Caption of Image.

మనం ఏటీఎం (ATM) నుండి డబ్బులు తీయాలంటే నాలుగు అంకెల పిన్ నంబర్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఆ పిన్ లేకపోతే రూపాయి కూడా బయటకు రాదు. పైగా పదేపదే తప్పు పిన్ కొడితే కార్డు బ్లాక్ అయిపోతుంది. మన బ్యాంకు అకౌంట్‌లో ఉన్న డబ్బుకు ఈ నాలుగు అంకెల పిన్నే పెద్ద రక్షణ.

అయితే, అసలు ఈ ఏటీఎం పిన్ వ్యవస్థను కనిపెట్టింది ఎవరో.. దాన్ని కనిపెట్టినందుకు అతనికి దక్కిన బహుమతి ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు… దీని వెనుక ఒక వింతైన, ఆసక్తికరమైన కథ ఏంటంటే…

కనిపెట్టింది ఒక స్కాటిష్ ఇంజనీర్
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు వాడుతున్న ఈ  పిన్ (PIN) సెక్యూరిటీ సిస్టమ్‌ను జేమ్స్ గుడ్‌ఫెలో అనే స్కాటిష్ ఇంజనీర్ 1966లో కనిపెట్టారు. ఆ సమయంలో ఆయన బ్రిటన్‌లోని ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పని చేస్తూ, బ్యాంకుల కోసం క్యాష్ మెషీన్స్  తయారు చేసే ప్రాజెక్ట్‌లో ఉన్నారు.

 కేవలం 10 పౌండ్లు మాత్రమే!
కార్డును మిషన్‌లో పెట్టి, ఒక సీక్రెట్  పిన్ నంబర్ నొక్కడం ద్వారా.. డబ్బులు తీసే ఆ వ్యక్తి నిజమైన కస్టమరా కాదా అని కనిపెట్టే అద్భుతమైన టెక్నాలజీని జేమ్స్ గుడ్‌ఫెలో సృష్టించారు.

►ALSO READ | ఫోన్‌పే యూజర్లకు షాక్: వాలెట్ వాడట్లేదా? అయితే రూ.100 ఫైన్ కట్టాల్సిందే!

ప్రపంచ బ్యాంకింగ్ రంగాన్నే మార్చేయబోయే ఇంత పెద్ద విప్లవాత్మక ఆవిష్కరణ చేసినందుకు ఆయన కంపెనీ మెచ్చుకుంది. కానీ, దానికి ప్రతిఫలంగా అతనికి ఇచ్చిన బోనస్ ఎంతో తెలుసా ? కేవలం 10 పౌండ్లు మాత్రమే అంటే మన రూపాయల్లో చూస్తే 1000 పైగా ఉంటుంది. నేడు లక్షల కోట్ల బిజినెస్‌ను కాపాడుతున్న ఐడియాకు అప్పట్లో అతనికి దక్కిన పారితోషికం అంతే. 

ఏటీఎం ప్రయాణం సాగిందిలా..
జేమ్స్ గుడ్‌ఫెలో ఈ పిన్ టెక్నాలజీని కనిపెట్టిన ఏడాదికే.. అంటే 1967లో బ్రిటన్ రాజధాని లండన్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఏటీఎం మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ టెక్నాలజీ ప్రపంచమంతటా వేగంగా విస్తరించింది. 1973 జూన్ 4న అమెరికాలో ఈ ఏటీఎం వ్యవస్థకు సంబంధించిన అధికారిక పేటెంట్ లభించింది. అలా మొదలైన ఈ 4 అంకెల పిన్ ప్రయాణం.. ఈ రోజు మన జేబులోని ఏటీఎం కార్డు వరకు వచ్చి చేరింది.

©️ VIL Media Pvt Ltd.