Reading Time: < 1 minute

గచ్చిబౌలి అంజయ్య నగర్లోని నవాబ్స్ రెస్టారెంట్‌ ఇంత ఘోరమా..?

Caption of Image.

హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని 4 రెస్టారెంట్లలో CMC ఫుడ్ సేఫ్టీ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేశాయి. ది స్పైస్ కిచెన్లో వంటగది, ఫ్రీజర్, స్టోరేజ్ ప్రాంతాల్లో భారీగా బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. నిల్వ చేసిన ఆహార పదార్థాల్లో పురుగులు, ఫ్రీజర్‌లో పాడైన ఫుడ్, ర్యాప్ చేయని చికెన్ నిల్వ చేసినట్లు గుర్తించారు.

వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను కలిపి నిల్వ చేయడంతో పాటు, కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంజయ్య నగర్లోని నవాబ్స్ రెస్టారెంట్లో ఫ్రీజర్లు దుర్వాసనతో, రక్తపు మరకలతో ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్‌నెస్ రికార్డులు, వాటర్ టెస్టింగ్ రిపోర్ట్స్ అందుబాటులో లేవని అధికారులు తేల్చారు.

►ALSO READ | హెల్తీ అనుకుని వంటింట్లో ఈ నూనెలు వాడుతున్నారా?.. వంటల్లో అస్సలు వాడకూడని 4 నూనెలు ఇవే!

కూకట్‌పల్లిలో బ్రౌన్ బేర్ బేక్ మ్యాక్స్ ఫుడ్స్లో బేకింగ్ కోసం ఉపయోగించే గుడ్లను శుభ్రపరచకుండా నిల్వ చేసినట్లు గుర్తించారు. కిచెన్లో బొద్దింకలు తిరుగుతున్నాయి. తుప్పు పట్టిన బేకింగ్ ట్రేలు, ముడి పదార్థాల గోదాంలో పావురాలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. తయారైన ఉత్పత్తులపై ఎక్స్పైర్ డేట్ లేదు. మదీనాగూడలోని బహార్ కేఫ్లో వంటగది, పైకప్పు అధ్వాన్నంగా ఉందని అధికారులు గుర్తించారు.

వంట, తాగునీటికి ఉపయోగించే నీటిని పరీక్షించకపోవడం, ఫుడ్ ఐటమ్స్‌పై లేబులింగ్ లేనట్లు తేల్చారు. స్పైస్ కిచెన్, బహార్ కేఫ్,  నవాబ్స్ రెస్టారెంట్‌లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బేక్ మ్యాక్స్ ఫుడ్స్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు ఆహార నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.