Reading Time: 2 minutes
Jamun Trees Fruiting Heavily Linked To El Nino Truth Behind Rainfall And Drought Beliefs

Jamun-El Niño: ఈ ఏడాది ‘‘నేరేడు పండ్లు’’ విరగకాశాయి. ప్రస్తుతం, మార్కెట్‌లో చూస్తే నేరేడు పండ్లను విరివిగా అమ్ముతున్నారు. ఇది ఫ్రూట్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నప్పటికీ, ఒక విషయం మాత్రం రైతుల్ని, గ్రామాల్లో ప్రజల్ని భయపెడుతోంది. నేరేడు పండ్ల దిగుబడి పెరిగిన ఏడాదిలో వర్షాలు తగ్గుతాయని, కరువు పరిస్థితులు ఎదురవుతాయని వారి భయం. మన అమ్మలు, తాతలు చెప్పే ఈ విషయంపై క్లారిటీ లేకున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తే ఇది నిజమనే నమ్మాల్సి వస్తోంది. ఎందుకంటే, ఈ ఏడాది ‘‘ఎల్ నినో’’ ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇది ఏర్పడిన ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయి. పంటలు దెబ్బతింటాయి, కరువు పరిస్థితులు ఏర్పడుతాయి. ఇప్పటికే, వర్షాలు ముహం చాటేశాయి. శాటిలైట్ చిత్రాల్లో మేఘాల జాడ లేదు.

అసలు ఎన్ నినో అంటే ఏమిటి?

పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవడం వల్ల ‘‘ఎల్ నినో’’ అనే వాతావరణ దృగ్విషియం ఏర్పడుతుంది. ఇది ఏర్పడిన ఏడాది భారత్ సహా ఉపఖండం అంతటా వర్షాలు తగ్గుతాయి. రుతుపవనాలు ముఖం చాటేస్తాయి. మరోవైపు, అమెరికా, పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

నేరేడు పండ్లకు ఏం సంబంధం:

నేరేడు పండ్లు విరగకాయడం, నేరేడు చెట్ల ఈ ప్రవర్తనను ‘‘మాస్టింగ్’’ లేదా ‘‘స్ట్రెస్ ఫ్రూటింగ్’’ అని పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే, రాబోయే ప్రకృతి విపత్తును మనుషుల కన్నా ముందే మొక్కలు గుర్తించడం. నేరేడు చెట్లు తన జీవితాన్ని పణంగా పెట్టి ఎక్కువగా దిగుబడి ఇస్తుంది. దీనిని సూసైడ్ ఫ్రూటింగ్‌గా పిలుస్తారు. నేరేడు చెట్ల వేరు భూమి లోకి చాలా లోతుగా వెళ్లాయి. రాబోయే నెలల్లో భూగర్భ జలాలు తగ్గుతాయని, వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉండని పసిగడుతుంది.

ఈ నేపథ్యంతో తనను తాను, తన వంశాన్ని కాపాడుకునే ఉద్దేశంతో చెట్లు కొత్త కొమ్మలకు బదులుగా, తన శక్తినంతా ఖర్చు చేసి పండ్లను ఇస్తుంది. దీని ద్వారా తన వంశాన్ని భవిష్యత్తులో నిలుపుకోవచ్చని భావిస్తుంది. కొత్త విత్తనాల కోసమే చెట్లు ఇలా ఎక్కువగా పండ్లను ఉత్పత్తి చేస్తాయని భావిస్తారు. ఇందుకే మన తాతలు, అమ్మమ్మలు నేరేడు చెట్లు విరగకాస్తే, కరువు తప్పదని చెబుతుంటారు.

దీనికి అనుగుణంగా వాతావరణం:

జూన్ నెల ప్రారంభమై సగం రోజులు పూర్తయినా ఇప్పటికీ సరైన వర్షాలు లేవు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గాడ్జిల్లా ఎల్ నినో వస్తోందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ఇటీవల దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయని చెప్పాయి. వీటి వల్ల అరకొర వర్షాలు పడ్డాయి. అయితే, ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్‌లలో భారత్‌పై మేఘాల ఛాయలే కనిపించడం లేదు. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది వర్షపాత లోటు తప్పదని తెలుస్తోంది.