
మన చుట్టూ ఉండేవాళ్లలో కొందరికి చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంటుంది. గట్టిగా అరిచేస్తుంటారు, వెంటనే రియాక్ట్ అయిపోతుంటారు. అయితే, అలా కోప్పడినంత మాత్రాన వాళ్లు చెడ్డవాళ్లని కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారికి పుట్టుకతోనే కొంచెం కోపం, పౌరుషం ఎక్కువ. కానీ, వాళ్ల మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. ఎవరిపైనా పగ, ప్రతీకారాలు పెట్టుకోరు. కోపం ఎంత వేగంగా వస్తుందో, అంతే వేగంగా తగ్గిపోతుంది. అలాంటి కోపం ఉండే ఆ నాలుగు రాశులేంటో ఇప్పుడు చూద్దాం…
1. మేష రాశి
మేష రాశి వారు చాలా యాక్టివ్‌గా, ఉత్సాహంగా ఉంటారు. వీరికి ఎక్కడైనా అన్యాయం జరుగుతోందనిపిస్తే అస్సలు సహించలేరు. వారికీ నచ్చనిది ఏదైనా జరిగితే వెంటనే కోపంతో ఊగిపోతారు. వీరి కోపం చూసి చుట్టుపక్కల వాళ్లు ఒక్కోసారి భయపడవచ్చు లేదా ఆశ్చర్యపోవచ్చు. కానీ, నిజం ఏంటంటే.. వీళ్లు ఎక్కువ సేపు కోపంగా ఉండలేరు. కాసేపటికే అంతా మర్చిపోయి మామూలైపోతారు.
2. సింహ రాశి
సింహ రాశి వారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎవరైనా సరే వీరి గౌరవానికి భంగం కలిగించినా లేదా వీరి మనసును నొప్పించినా అస్సలు ఊరుకోరు, వెంటనే కోపం వచ్చేస్తుంది. అయితే వీరి కోపం ఆ సమయానికి మాత్రమే పరిమితం. నిజానికి వీరు చాలా ఉదార స్వభావం కలవారు. వారికీ నచ్చిన వాళ్ల కోసం, స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అందుకే వీరికి కోపం ఎక్కువైనా, జనాలు వీరిని బాగా నమ్ముతారు.
3. వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఏ విషయాన్నైనా చాలా లోతుగా ఆలోచిస్తారు, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పైకి చాలా గంభీరంగా, కఠినంగా కనిపించిన.. లోపల మాత్రం చాలా సున్నితంగా ఉంటారు. వారికీ నచ్చిన వాళ్లు ఎవరైనా మోసం చేసినా లేదా వారిని పట్టించుకోకపోయినా వీరికి తట్టుకోలేనంత కోపం వస్తుంది. వీరి కోపం వెనుక స్వార్థం లేదా కీడు చేయాలనే ఉద్దేశం ఉండదు, కేవలం బాధ మాత్రమే ఉంటుంది.
4. ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం కలవారు. వీరికి అబద్ధాలు ఆడటం, నటించడం అస్సలు నచ్చదు. ఏమున్నా మొహం మీదే చెప్పేస్తారు. ఈ ముక్కుసూటితనం వల్ల ఒక్కోసారి ఇతరులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. కానీ, ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం వీరికి ఉండదు. కేవలం నిజాయితీగా ఉండాలి, నిజమే మాట్లాడాలి అనేదే వీరి తాపత్రయం.
►ALSO READ | హెల్తీ అనుకుని వంటింట్లో ఈ నూనెలు వాడుతున్నారా?.. వంటల్లో అస్సలు వాడకూడని 4 నూనెలు ఇవే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి కొంచెం కోపం, చిరాకు ఎక్కువే కావచ్చు. కానీ, వీరి మనసులో ఎలాంటి ద్వేషం ఉండదు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి మాట్లాడటం వీరికి రాదు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.