
మన దేశంలో టాప్ యూనివర్సిటీలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబై, ఐఐటీ మద్రాస్… ఈ యూనివర్సిటీల్లో చదవాలని చాలామంది కలలు కంటుంటారు. వీటిలో సీట్ సాధిస్తే ప్రపంచాన్నే జయించినట్లు ఫీల్ అవుతారు. మన దేశంలో అంత ప్రాధాన్యత ఉన్న యూనివర్సిటీల పరిస్థితి ప్రపంచస్థాయిలో ఎలా ఉందో తెలుసా..? ప్రపంచస్థాయిలో టాప్ 200 యూనివర్సిటీల్లో మన దేశం నుంచి మూడే మూడు యూనివర్సిటీలకు స్థానం దక్కింది… అలా ఉంది మన దేశంలో యూనివరిసిటీల పరిస్థితి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల పనితీరు అంచనా వేసే QS యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ 2027 విడులయ్యాయి. ఈ జాబితాలో ఇండియాకు చెందిన మూడు యూనివెర్సిటీలకే టాప్ 200 లో స్థానం దక్కింది.
దేశంలో టాప్ యూనివర్సిటీగా ఉన్న ఐఐటీ ఢిల్లీ ప్రపంచ ర్యాంకింగ్స్ లో 118వ స్థానం దక్కించుకుంది. గత ఏడాదితో పోల్చితే…ఐదు స్థానాలు మెరుగుపడింది ఐఐటీ ఢిల్లీ. ఐఐటీ ముంబై ఇండియాలో సెకండ్ ప్లేస్ లో ఉంటే ప్రపంచవ్యాప్తంగా 134 ర్యాంక్ దక్కిన్చుకుంది. ఇక ఇండియాలో మూడో స్థానంలో ఉన్న ఐఐటీ మద్రాస్ ప్రపంచవ్యాప్తంగా 170వ ర్యాంక్ దక్కించుకుంది. టాప్ 200లో ఇండియాకు చెందిన కేవలం 3 యూనివర్సిటీలకే స్థానం దక్కడం గమనార్హం.
►ALSO READ | ఆ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన RBI.. మరి కస్టమర్ల డబ్బు సంగతి ఏంటి..?
ఇక ఇండియాలోని ఇతర టాప్ యూనివర్సిటీలు ఐఐటీ ఖరగ్‌పూర్ 205వ స్థానం, ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ కాన్పూర్ 221వ స్థానాలు దక్కించుకున్నాయి. రీసర్చ్ ఇంపాక్ట్, అకడమిక్ రెప్యుటేషన్, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు.
ఈ ర్యాంకింగ్స్ లో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఎమ్ఐటీ ) మరోసారి ఫస్ట్ ర్యాంక్ సాధించింది. వరుసగా 15వ ఏడాది ఎమ్ఐటీ ప్రథమస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఇంపీరియల్ కాలేజ్ లండన్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నిలిచాయి. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వర్సిటీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.