
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ సీక్వెల్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌కు సంబంధించిన కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయని టాక్. ఇక బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ ఈ సీక్వెల్‌లో కొత్త పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అలాగే దీపికా పదుకొణె పోషించిన ‘సుమతి’ పాత్రను సాయిపల్లవి కొనసాగిస్తారన్న వార్తలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సమయంలోనే కల్కి 2 నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
సీక్వెల్‌కు ముందే క్యారెక్టర్-బేస్డ్ కథలు..
డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి ఫ్రాంచైజీ ప్రపంచాన్ని మరింత విస్తరించేందుకు కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన సినిమాతోనే కథను ముగించకుండా, ఇందులోని కీలక పాత్రలపై ప్రత్యేక ఓటీటీ చిత్రాలను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రయోగం వెనుక ప్రధాన ఉద్దేశం.. కల్కి మొదటిభాగంలో సమయం సరిపోక చూపించలేని పాత్రల ప్రయాణాన్ని, వారి భావోద్వేగాలను, బ్యాక్‌స్టోరీలను మరింత క్లారిటీగా ప్రేక్షకులకు అందించడమే.
🚨Reports suggest the makers are exploring one-hour OTT spin-off films based on major characters from the Kalki Universe.#Kalki2
🚨These projects are expected to focus on the backstories and personal journeys of key characters.
🚨The proposed films could reportedly release on… pic.twitter.com/7L3OuEMZOS
— Bollywood Decode (@BollywoodD5z) June 18, 2026
అందువల్ల ఫస్ట్ పార్ట్లో కేవలం రెండు మూడు స్కీన్లకు పరిమితమైన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ పాత్రల నేపథ్యాన్ని వీటిలో చూపించనున్నారట నాగ్. ఈ ప్రణాళిక అమల్లోకి వస్తే, ‘కల్కి’ విశ్వాన్ని ప్రేక్షకులకు మరింత లోతుగా పరిచయం చేసే అవకాశం ఉంది. ఇపుడు ఈ ప్రయోగం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ ఓటీటీ పాత్రలన్నీ ప్రభాస్ ఎంట్రీ ముందే జరగనుందని సమాచారం. త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.
Birthday wishes to our beloved @dulQuer, the CAPTAIN from KALKI Cinematic Universe! ❤️🔥#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/Jw5ZQ3vfyy
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 28, 2024
నాగ్ అశ్విన్ ముందున్న సవాళ్లు..
ఓటీటీ చిత్రాల్లో ఒక్కో ప్రాజెక్ట్‌కు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశముందని సమాచారం. అయితే ఈ ప్రణాళికను కార్యరూపంలోకి తీసుకురావాలంటే పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా ఓటీటీ సంస్థల నుంచి గ్రీన్ సిగ్నల్ పొందడం, స్టార్ యాక్టర్స్ కాబట్టి వారి రేంన్యునరేషన్స్ను సమన్వయం చేయడం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. అయితే పెద్ద ఓటీటీ సంస్థల మద్దతు లభిస్తే, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఫ్రాంచైజీ కథనాలను విస్తరించే విషయంలో ఇది సరికొత్త మోడల్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
►ALSO READ | త్రివిక్రమ్ – వెంకీ మ్యాజిక్ ‘AK47 వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
‘కల్కి 2’పై ఆసక్తిని పెంచే ప్రయత్నం
ఈ స్పిన్-ఆఫ్ చిత్రాలు కేవలం కథను విస్తరించడానికే కాకుండా, ‘కల్కి 2898 AD పార్ట్ 2’పై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేందుకు కూడా ఉపయోగపడతాయని మేకర్స్ భావిస్తున్నారట. పాత్రల నేపథ్యం, వారి ఉద్దేశాలు, సంబంధాలను ముందుగానే చూపించడం ద్వారా సీక్వెల్‌పై మరింత హైప్ సృష్టించాలని చూస్తున్నట్లు సమాచారం.
భారతీయ సినీ పరిశ్రమలో ఈ తరహా వ్యూహం చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలకే డిజిటల్ డీల్స్ విషయంలో సవాళ్లు ఎదురవుతున్న సమయంలో ఇలాంటి ప్రయోగం ఎంతవరకు విజయవంతమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
‘కల్కి 2898 AD పార్ట్ 2’ పనులు వేగంగా
ఇక సీక్వెల్ పనులు కూడా క్రమంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే రెండు షూటింగ్ షెడ్యూల్స్ పూర్తయ్యాయని సమాచారం. తదుపరి షెడ్యూల్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ చిత్రంపై మరిన్ని అప్‌డేట్స్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Interesting buzz from the world of #Kalki2898AD 👀🔥
Reports suggest that #AliaBhatt is indeed a part of the sequel. However, she is reportedly not playing the much-discussed SUM-80 character, a role said to be portrayed by #SaiPallavi ❤️🔥
The buzz further indicates that Alia…
— Media Mic | Indian Cinema | Tollywood (@MMTollywood) June 16, 2026