
Sajjad Nomani: ప్రముఖ మైనారిటీ నాయకుడు మౌలానా ఖలీలుర్ రెహమాన్ సజ్జాద్ నోమానీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. భారతదేశంలో హిందువులు మెజారిటీ కాదని, తమిళులు, ఎస్‌సీలు, ఆదివాసీలు, సిక్కులు, బౌద్ధులు, లింగాయతులతో సహా పలు వర్గాలను హిందువులుగా పరిగణించకూడదని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని పెంచాయి. ఒక ఇస్లామిక్ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్్యలు చేశారు.
భారతదేశంలో హిందూ జనాభాలో సాధారణంగా చేర్చబడిని అనేక వర్గాలను అసలు హిందువులుగా పరిగణించకూడదని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివిధ వర్గాలను విడివిడిగా లెక్కిస్తే భారతదేశంలో హిందువులు మెజారిటీ కాదని ఆయన అన్నారు. సిక్కులు, బౌద్ధులు, ఎస్సీలు, ఆదివాసీలు, తమిళులు, లింగాయతుల్ని హిందువులుగా భావించకూడదని చెప్పారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ప్రమాదకరమైన, రెచ్చగొట్టలే వ్యాఖ్యలని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక విభేదాలను పెంచుతాయని ఆరోపించారు. దాదాపు 3 దశాబ్ధాలుగా భారత్ అంతటా పర్యటించి దేశ జనాభా, సామాజిక వాస్తవాలను అధ్యయనం చేశానని, క్షేత్రస్థాయి పరిశోధన ఆధారంగా తాను ఈ నిర్ధారణకు వచ్చానని మౌలానా అన్నారు. “లౌకిక హిందువులు” మరియు “మతోన్మాద హిందువులు” అనే విభజనపై విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ రాజకీయ అవగాహన ముస్లిం సమాజంలోని కొన్ని వర్గాలను తప్పుదోవ పట్టించిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యూహం చివరికి తాను కఠిన హిందుత్వవాద శక్తులుగా అభివర్ణించిన వర్గాలకే లాభం చేకూర్చిందని పేర్కొన్నారు.
अगरअब भी नहीं समझे तो कभी भी नहीं समझोगे
एक इस्लामिक समिट में मौलाना बोल रहा है
भारत में हिंदू अब बहूमत में नहीं है।
हिंदू बंटा हुआ है SC,आदिवासी,तमिल, लिंगायत + गैर-हिंदू हैं
हमने हिंदूओं को सेक्युलर और फासीवादी में बंटा लेकिन दोनो ने हमारे मकसद को नूकसान पहुंचाया। pic.twitter.com/fFa8EvkiDm
— Pradeep Maikhuri (@PradeepMaikhur3) June 18, 2026
अगरअब भी नहीं समझे तो कभी भी नहीं समझोगे
हमने हिंदूओं को सेक्युलर और फासीवादी में बंटा लेकिन दोनो ने हमारे मकसद को नूकसान पहुंचाया।