Reading Time: < 1 minute

ఠాగూర్ మూవీ సీన్ రిపీట్.. చనిపోయిన మనిషికి వైద్యం.. లక్షలు దండుకున్న ఆస్పత్రి యాజమాన్యం.. వీడియో వైరల్

Caption of Image.

ఠాగూర్ మూవీ సీన్ రిపీటయ్యింది.. అచ్చు సినిమాలో మాదిరిగా చనిపోయిన మనిషికి డాక్టర్లు వైద్యం చేశారు. కాదు కాదు.. వైద్యం చేస్తున్నట్లు నటించారు. వైద్యం చేస్తున్నంత సేపు పేషెంట్ కుటుంబ సభ్యులకు చుక్కలుచూపించారు. కండిషన్ చాలా సీరియస్ ఉందంటూ హడావుడి చేశారు. బాధిత కుటుంబాన్ని టెన్షన్ పెట్టారు. ఈ మందులు.. ఆ మందులు, ఈ వైద్యం..ఆ వైద్యం అంటూ డబ్బులు లాగి వారిని పిండి పిప్పి చేశారు.చివరికి అనుమానం వచ్చిన పేషెంట్ కుటుంబ సభ్యులు అసలు తెలుసుకొని దుఖంలో మునిగిపోయారు. 

మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది.డబ్బులకోసం ఓ మహిళ చనిపోయినా ఆ విషయాన్ని దాచిపెట్టిచికిత్స పేరిట డ్రామాలాడారు అక్కడి డాక్టర్లు. రోగి పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బిల్లులు పెంచుతూ కుటుంబ సభ్యులనుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేశారు.ఈ ఘటన కు సంబంధించిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  అసలు విషయం బయటపడింది. 

సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో  నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.ఇలాంటి దోపిడీకి పాల్పడుతున్న ఆస్పత్రులను గుర్తించి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తుననారు. అక్రమాలకు పాల్పడుతున్న డాక్టర్ల ఎంబీబీఎస్ ప్రాక్టీస్ రద్దు చేయాలని, ఆస్పత్రుల యాజమాన్యం ఆస్తులపై విచారణకు ఆదేశించాలని కోరుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.