Reading Time: < 1 minute
Delhi Doctor Arrested For Killing Househelp Over Black Magic Suspicion

Black Magic: ‘‘చేతబడి’’ అనుమానంతో పనిమనిషి హత్యకు గురైంది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. నగరంలోని ప్రముఖ ప్రాంతమైన మౌంట్ కౌలాష్‌లో 45 ఏళ్ల పనిమనిషిని బ్యాట్‌తో కొట్టి, ఆపై కత్తితో పడించి చంపారు. హత్యకు పాల్పడిన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలిని మీనాగా గుర్తించారు. మీనా డాక్టర్ మనీష్ గుప్తా ఇంట్లో పనిమనిషిగా ఉంది. డాక్టర్ ఇంటి సమీపంలోని భవనం పైకప్పుపై రక్తపు మడుగులో మృతదేహం పడి ఉందనే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరారు. మృతదేహం పక్కనే డాక్టర్ కూర్చుని ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

మొదట పోలీసులు గుప్తాను అదుపులోకి తీసుకుని విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. పనిమనిషి తన ఇంట్లో చేతబడి చేస్తూ, అశాంతిని కలిగిస్తోందని, చేతబడి కారణంగా తన కుటుంబం మొత్తం తీవ్ర ఆందోళనకు గురైందని పోలీసులతో చెప్పాడు. ఇద్దరి మధ్య ఏదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన బ్యాట్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తు్న్నారు.