Reading Time: 2 minutes

హెల్తీ అనుకుని వంటింట్లో ఈ నూనెలు వాడుతున్నారా?.. వంటల్లో అస్సలు వాడకూడని 4 నూనెలు ఇవే!

Caption of Image.

మన వంటింట్లో వంటనూనె పాత్ర చాలా పెద్దది. ఏ కూర వండాలన్నా నూనె లేనిదే పని జరగదు. అయితే, ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి రకరకాల నూనెలు వస్తున్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మంచివని కంపెనీలు చెప్పే ప్రకటనలు చూసి మనం కూడా నిజమేనని నమ్మేస్తుంటాం. కానీ, మనం వాడే కొన్ని రకాల నూనెలు గుండె జబ్బులకు, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకటనలు చూసి మోసపోకుండా, మన ఆరోగ్యానికి హాని చేసే.. మనం వాడకూడని ఆ వంటనూనెలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

పామ్ కెర్నెల్ ఆయిల్
చాలామంది పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ రెండూ ఒకటే అనుకుంటారు. పామ్ ఆయిల్ ని పండు నుంచి తీస్తారు. పామ్ కెర్నెల్ ఆయిల్ ని గింజ నుంచి తీస్తారు. ఈ రెండూ ఒకేరకమైన గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే పామ్ కెర్నెల్ ఆయిల్ ని వాడకపోవడమే మంచిది.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో కొలెస్ట్రాల్, కొవ్వులు ఎక్కువ. అందుకే దీనిని వంటల్లో కాకుండా జుట్టుకు వాడడమే మంచిది. వంటల్లో ఎక్కువగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తే రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా చేరుతుంది. కేరళలో కొబ్బరి నూనె వినియోగం ఎక్కువగా ఉన్నా.. ఆయా ప్రాంతాల సంప్రదాయాల వల్ల కొబ్బరినూనె సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా కనిపించడం లేదు. అలాగని మిగతా ప్రాంతాల వాళ్లు కూడా కొబ్బరినూనె వాడడం మంచిది కాదు.

జొన్న నూనె
కొన్నిరోజుల కిందట జొన్నగింజల నూనె మార్కెట్ లోకి వచ్చింది. ఇది ఎంతో హెల్దీ అని అంతా చెప్పుకున్నారు. కాని తర్వాతి రోజుల్లో అది అంత హెల్దీ కాదని, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయని తేలడంతో ఈ నూనెను వాడడం తగ్గించేశారు.

ALSO READ : ఆరోగ్యానికి, అందానికి ‘దానిమ్మ’ ఒక సంజీవని..

హైడ్రోజినేటెడ్ ఆయిల్
హైడ్రోజినేటెడ్ ఆయిల్ పేరుతో కూడా మార్కెట్లో లో వంటనూనెలు అమ్ముతున్నారు. దీనిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను బ్లాక్ చేస్తాయి.

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.