
బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ (Ravi Kishan).. అంటే తెలుగు నార్మల్ ఆడియన్స్కు చూస్తే తప్ప గుర్తుపట్టకపోవొచ్చు. కానీ, ‘రేసుగుర్రం’లో మద్దాలి శివారెడ్డిగా నటించిన యాక్టర్ అంటే ప్రతి తెలుగు ప్రేక్షకుడికి సుపరిచతం. ఈ సినిమాలో తనదైన నటనతో, డైలాగ్ డెలివరీతో విలనిజంలోనూ నవ్వులు పూయించి ఈ పాత్రను ఒక కల్ట్ క్యారెక్టర్‌గా మార్చారు. అలాంటి నటుడు రవికిషన్ ఇపుడు సోషల్ మీడియాలో ట్రోల్స్తో ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, నటుడు రవికిషన్ జూన్ 16న ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ఆసనాలు చేస్తూ రవికిషన్ అందరినీ ఆకట్టుకున్నారు. అదే సమయంలోనూ యోగా చేస్తూనే ఆయన ఏదో నములుతున్నట్లు కనిపించడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. రవికిషన్ నోట్లో ఉన్నది గుట్కా లేదా పొగాకు పదార్థం ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
गुटखा खाकर कौन योगा करता है भाई? pic.twitter.com/AUqLm2NhTz
— Parmanand Azamgarhi (@parmanandyadavv) June 17, 2026
‘గుట్కా తింటూ యోగా చేసే వారు ఎవరైనా ఉంటారా?’ అంటూ ఒకరు ప్రశ్నించగా, ‘శరీరానికి మాత్రమే యోగా సరిపోతుందా? నోటికి యోగా అవసరం లేదా?’ అంటూ మరొకరు సెటైర్లు వేశారు. మరో నెటిజన్ ‘వీళ్లు యోగా చేస్తున్నారా? లేక ఫొటోషూట్ చేస్తున్నారా?’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే కొందరు మాత్రం రవికిషన్‌కు మద్దతుగా నిలిచారు. ‘అజ్వైన్, యాలకులు, లవంగాలు వంటి వాటిని కూడా నములుతారు. కనిపించిన ప్రతిదాన్నీ గుట్కా అని అనుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ మరో నెటిజన్ ఆయనకు మద్దతు తెలిపారు.
मा सांसद रवि किशन जी ऑक्सीजन को चबाते हुए योगा कर रहे हैं,
अब कुछ आलोचक कहेंगे कि गुटखा खाये हुए हैं. pic.twitter.com/u6phUdpFgP
— Saral Vyangya (@SaralVyangya) June 17, 2026
ఇదిలా ఉంటే, భోజ్‌పురి సినీ పరిశ్రమకు కొత్త ఊపిరి పోసిన నటుడిగా రవికిషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించిన ఆయన, తరువాత భోజ్‌పురి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఆ ఇండస్ట్రీకి పునర్జీవం పోశారు.
ఇటీవల ‘లాపతా లేడీస్’, ‘మామ్లా లీగల్ హై’, ‘పెద్ది’, ‘మా బేహన్’ వంటి ప్రాజెక్ట్‌లలో నటించిన ఆయన, త్వరలో ‘ధమాల్ 4’ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 10, 2026న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ప్రస్తుతం రవికిషన్ యోగా వీడియో కంటే, ఆయన నోట్లో నిజంగా గుట్కా ఉందా? లేదా అనే చర్చే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.