Reading Time: < 1 minute

అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి.. మగాళ్లను ట్రాప్ లో పడేసి.. కోట్లు దోచుకున్నాడు..

Caption of Image.

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిగా మారిన అబ్బాయి మగాళ్లను వలలో వేసుకొని కోట్లు దోచుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అతడి  పేరు మోహన కృష్ణ  కాని అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న లక్ష్యంగా అమ్మాయిగా మారి మధుశ్రీ గా పేరు మార్చుకున్నాడు. అమాయకులను నిలువుదోపిడీ చేసి కోట్లు దోచుకున్నాడు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలోని శివాజీనగర్‌కు చెందిన మోహన కృష్ణ కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి ముంబై వెళ్లి పోయి అక్కడ సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారిపోయి తిరిగి ఇంటికొచ్చాడు.

అమ్మాయిగా మారిన మోహనకృష్ణ చీరకట్టుతో ముస్తాబు అవుతూ మగాళ్లకు వలపు వల విసిరి కొందరిని మోసం చేయగా పూజలు, గుప్త నిధుల పేరుతో మరికొందరిని మోసం చేశాడు. ఇంట్లో ప్రేతాత్మలు ఉన్నాయని… వాటిని తొలగిస్తానని మరికొందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అన్నమయ్య జిల్లాలోనే కాకుండా చాలా ప్రాంతాల్లో కూడా జనాన్ని మోసం చేశాడు మోహనకృష్ణ.

►ALSO READ | 3 నెలలుగా వెంటాడి వేటాడి సీఐ నాగరాజు కొడుతున్నాడు.. సెల్ఫీ వీడియోలో చెప్పి ఆత్మహత్య

అంతే కాకుండా ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని పెళ్లిళ్లకు వెళ్లి జంటలకు దిష్టి తీసి డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వని వారిని బూతులు తిడుతూ శపించడం, ఎదురు తిరిగినవారిని పోలీసులు, రాజకీయ నాయకుల పేరు చెప్పి బెదిరించడం వృత్తిగా మార్చుకున్నాడు. 

మోహనకృష్ణ బాధితులు మీడియా ముందుకు రావడంతో బండారం బయటపడింది. సుమారు 13 కుటుంబాలు మోహనకృష్ణ మత్తులో ఉన్నారని..కోట్లు మోసపోయామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.