
సౌత్ సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ కుమార్తె ఆనందిత సుందర్, తన బరువు తగ్గడంపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. రీసెంట్గా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. 2018లో ప్రారంభమైన ఫిట్‌నెస్ ప్రయాణానికి ఏడేళ్ల కష్టం ఫలితమే ప్రస్తుతం కనిపిస్తున్న మార్పు అని చెప్పారు. అంతేకానీ సర్జరీలు చేయించుకుని అందరీ మెప్పు పొందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆనందిత సుందర్ ఎదుర్కొన్న సమస్యలు, అధిగమించిన విధానం ఎలాంటిందో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బరువు తగ్గడంపై వస్తున్న రూమర్లకు చెక్..
నటి ఖుష్బూ సుందర్, దర్శకుడు సుందర్ సి కుమార్తె ఆనందిత సుందర్ ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొని, సెలబ్రిటీల పిల్లలుగా పెరుగుతూ తాము ఎదుర్కొన్న ట్రోలింగ్, విమర్శలు, మానసిక వేదన గురించి మనసు విప్పారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల కారణంగా ప్రజల దృష్టిలో ఉండటం వల్ల, తన రూపురేఖలపై వచ్చే కామెంట్స్ జీవితంలో ఒక భాగంగా మారిపోయాయని ఆమె తెలిపారు. ముఖ్యంగా టీనేజ్ వయసులో ఆ విమర్శలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పారు.
తన ఫిట్‌నెస్ జర్నీ గురించి వివరంగా మాట్లాడుతూ.. ‘తాను అకస్మాత్తుగా బరువు తగ్గలేదని, 2018 లేదా 2019లోనే వెయిట్ లాస్ ప్రయాణం ప్రారంభించానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రూపానికి రావడానికి ఏకంగా ఏడేళ్ల సమయం పట్టిందని వెల్లడించారు. ఇందుకోసం అందరూ అనుకున్నట్లుగా సర్జరీలు చేయించుకోలేదని, వెయిట్ లాస్‌కు సహాయపడే ఓజెంపిక్, మౌంజారో వంటి మందులు వాడలేదని స్పష్టం చేశారు ఆనందిత. ఇక చిన్నప్పటి నుంచి బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని, 15 ఏళ్ల వయసులోనే తీవ్ర విమర్శలు భరించాల్సి వచ్చిందని’ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను, తన సిస్టర్ అవంతిక చిన్నప్పటి నుంచి ఊబకాయం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నామని, అందుకే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టామని చెప్పారు. ఇతరులను మెప్పించేందుకు కాదని తెలిపారు. అందుకే ఇప్పుడు చూసి సర్జరీలు చేయించుకుందంటూ కథలు అల్లుతున్నారు. అంతేకానీ, లాక్ డౌన్ నుంచి ఈ మూడేళ్ళ వ్యవధిలో మాలో వచ్చే మార్పులను మాత్రం గమనించలేదని, అలా మమ్మల్ని చూడకుండానే ఎలా నిర్ణయానికి వస్తారు? అని ప్రశ్నించారు.
ట్రాన్స్‌జెండర్‌లతో పోల్చి ట్రోల్ చేయడంపై..
ఇదే సమయంలో ఆనందిత సుందర్ సోషల్ మీడియాలో తనను ట్రాన్స్‌జెండర్ వ్యక్తిలా కనిపిస్తున్నావంటూ అవమానించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఎంతో అందమైనవారని, వారితో పోల్చడం అవమానం కాదని స్పష్టం చేశారు. అలాంటి వ్యాఖ్యలు తనపై మాత్రమే కాకుండా ట్రాన్స్‌జెండర్ సమాజంపై కూడా వివక్షను చూపిస్తున్నాయని అన్నారు. తన ఫోటోలపై వచ్చే ద్వేషపూరిత కామెంట్లకు అలవాటు పడిపోయినా, సమాజంలో ఇంత ప్రతికూలత ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ : లీగల్ చిక్కుల్లో కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ
కుమార్తెపై గర్వపడుతున్న ఖుష్బూ..
ఈ పోడ్‌కాస్ట్ క్లిప్‌ను ఖుష్బూ సుందర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ, “నీపై చాలా గర్వంగా ఉంది బొమ్మై” అంటూ హార్ట్ ఎమోజీలతో కుమార్తెకు మద్దతు తెలిపారు. 2020లో బీజేపీలో చేరిన ఖుష్బూ, ప్రస్తుతం తమిళనాడు బీజేపీ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. .
క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఆనందిత
ఇటీవల అశ్విన్ కందసామి దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఆక్యుపెన్సీ’ చిత్రంతో ఆనందిత సుందర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రాన్ని ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. దీంతో పాటు మరిన్ని ప్రాజెక్టులతో కూడా ఆనందిత ప్రస్తుతం బిజీగా ఉన్నారు.