
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును వరుస గాయాలు కలవరపెడుతున్నాయి. టోర్నీ మొదటి నుంచి కూడా స్టార్ ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రి పాలవ్వడం మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే జట్టు వెన్నెముక వంటి మహేంద్ర సింగ్ ధోని, నాథన్ ఎల్లిస్, బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయాలతో దూరం కాగా.. ఇప్పుడు యువ సంచలనం ఆయుష్ మాత్రే కూడా ఈ జాబితాలో చేరడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. గత మ్యాచ్‌లలో అద్భుత ఫామ్‌తో జట్టును ఆదుకున్న ఈ ఆటగాళ్లు లేకపోవడం జట్టు సమతుల్యతను దెబ్బతీసేలా కనిపిస్తోంది.
CSK జట్టుకు మరో గట్టి దెబ్బ..
సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ సిఎస్కేకు విజయాన్ని అందించినా, ఆయుష్ మాత్రే రూపంలో తీరని లోటును మిగిల్చింది. మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆయుష్ తీవ్రమైన కండరాల గాయానికి గురయ్యాడు. దీనిపై జట్టు బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ స్పందిస్తూ.. ఆయుష్ తొడ కండరాల్లో చీలిక వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. త్వరలో జరిగే స్కాన్ రిపోర్ట్స్ తర్వాతే అతను ఎన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడో తెలుస్తుందని, అయితే ప్రస్తుతానికి పరిస్థితి కాస్త సీరియస్‌గానే ఉందని హస్సీ పేర్కొన్నారు.
Also Read:PM Modi: సభలో భావోద్వేగం… చిన్నారి చూపిన అమ్మ ఫోటోతో మోడీ కంటతడి!
ప్రస్తుత ఫామ్..
సిఎస్కే ప్రస్తుత సీజన్‌లో మిశ్రమ ఫలితాలతో కొనసాగుతోంది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో జట్టు బ్యాటింగ్ పరంగా బాగానే ఉన్నా, బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు.. ఫినిషర్‌గా ధోని అందుబాటులో లేకపోవడం వల్ల ఆఖరి ఓవర్లలో స్కోరు బోర్డు ఆశించిన వేగంతో కదలడం లేదు. ఆయుష్ మాత్రే తన అటాకింగ్ బ్యాటింగ్‌తో మిడిల్ ఓవర్లలో జట్టుకు కీలక పరుగులను జోడిస్తున్నాడు. ఇప్పుడు అతను కూడా దూరం కావడం వల్ల బెంచ్ స్ట్రెంత్‌పై భారం పడనుంది.
ప్లేఆఫ్స్ అవకాశాలపై ప్రభావం..
పాయింట్ల పట్టికలో టాప్-4 లో నిలవాలంటే సిఎస్కే వచ్చే ప్రతి మ్యాచ్‌నూ గెలవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో కీలకమైన నలుగురు ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం ప్రత్యర్థి జట్లకు కలిసొచ్చే అంశం.