Reading Time: < 1 minute
Iran Strikes Kuwait Port Us Troops Killed Middle East War

Iran Strikes Kuwait: ఇరాన్ రెచ్చిపోయి దాడులు చేస్తోంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా కువైట్‌లోని షువైఖ్ పోర్టులో ఆరు అమెరికన్ ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీలపై దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో అమెరికన్ బలగాలను హతమార్చినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. 1000 కి.మీ పరిధిలో కలిగిన ఖాదర్ 380 క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించి దాడులు జరిపినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Lenin: పెద్ది కోసం వెనక్కి తగ్గిన అయ్యగారు!

ఆపరేషన్ ట్రూ ప్రామిస్‌లో భాగంగా అల్-షోయూఖ్ పోర్టుతో పాటు దుబాయ్ తీరప్రాంతాలు మరియు పోర్టులో మోహరించిన అమెరికన్, ఇజ్రాయెల్ సైనికులపై తాము హైబ్రిడ్ దాడులు నిర్వహించినట్లు ఇరాన్ చెప్పింది. ఈ దాడిలఅో మూడు యుద్ధ నౌకలు ముగినిపోగా, మిగిలినవి మంటల్లో కాలిపోతున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అల్ ఖర్జ్ స్థావరం వద్ద అమెరికా సైన్యానికి ఇంధనం నింపే వెహికిల్స్, లాజిస్టికల్ సపోర్ట్ ఫ్లీట్‌ను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

దుబాయ్‌లోని ఒక హోటల్‌పై కామికేజీ డ్రోన్ల ద్వారా దాడులు చేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడులు జరిగాయని, దీని వల్ల రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో కువైట్, బహ్రైయిన్ సహా ప్రధాన విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేశారు.