Reading Time: 2 minutes
Hardik Pandya Proves His Kindness With Gifts Wankhede Ground Staff

Hardik Pandya: టీమిండియా జట్టులో యాటిట్యూడ్ గా బాప్ ఎవరయ్యా అంటే.. అందరి నుండి వచ్చే ఏకైక సమాధానం “హార్దిక్ పాండ్య”. ఎవరు ఎలా పోతున్న.. ఎలాంటి కామెంట్స్ చేస్తున్న.. నేను ఇంతే అన్నట్లుగా గ్రౌండ్ లోను, బయట హార్దిక్ వ్యవహరిస్తుంటారు. అయితే ఇప్పుడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ పట్ల హార్దిక్ పాండ్యా చూపించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

RCB vs SRH Head To Head: షాకింగ్ లెక్కలు.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. తోపు ఎవరో తెలుసా?

టీ20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా, పాండ్యా ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రంతా శిక్షణ తీసుకున్నాడు. తరచుగా దాదాపు అర్ధరాత్రి వరకు సాధన చేసేవాడు. ఆ సమయంలో తనకు అవిశ్రాంతంగా మద్దతునిచ్చిన గ్రౌండ్‌ స్టాఫ్‌ కు, తాను మళ్లీ అక్కడికి తిరిగి వచ్చినప్పుడు వారికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేశాడు. దీనితో తన ప్రాక్టీస్ సమయంలో గ్రౌండ్ స్టాఫ్ ఎంతో సహకరించారని గుర్తుచేసుకున్న హార్దిక్, టోర్నమెంట్‌ ముగిసిన తర్వాత వారికి ప్రత్యేకంగా బహుమతులు అందజేశాడు.

ఇక హార్దిక్ పాండ్యా ప్రదర్శన విషయానికి వస్తే 2026 టీ20 వరల్డ్ కప్‌లో అతను అద్భుత ఫామ్‌ తో కీలక పాత్ర పోషించాడు. కీలక సందర్భాల్లో జట్టుకు తోడ్పడుతూ టీమిండియాను విజేతగా నిలిపే పనిలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక మరోవైపు, భారత జట్టు మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతని అభిప్రాయం ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ నే ముంబై ఇండియన్స్‌కు సరైన కెప్టెన్ అని అన్నారు. ప్రస్తుతం సూర్య భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. టీ20 వరల్డ్ కప్ 2026లో జట్టును విజయవంతంగా నడిపించాడు. ఈ నేపథ్యంలో అతనికి కెప్టెన్సీ ఇవ్వడం సహజమేనని ఆశ్విన్ అభిప్రాయపడ్డాడు.

RCB vs SRH: బౌలర్లు vs బ్యాటర్లు.. ఇరు జట్లలో స్టార్ పేసర్లు దూరం.. ఓపెనింగ్‌లోనే హై వోల్టేజ్ ఫైట్!

అయితే మరోవైపు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ సామర్థ్యాన్ని కూడా ఆశ్విన్ ప్రశంసించాడు. అతను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా తన తొలి సీజన్‌ లోనే టైటిల్ గెలిపించడంతో పాటు, రెండో సీజన్‌ లో రన్నరప్‌ గా నిలిపాడని కొనియాడాడు. కాకపోతే ముంబై ఇండియన్స్‌ కు కెప్టెన్‌గా వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు కొంత క్లిష్టంగా మారాయని, ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ మార్పుపై జరిగిన చర్చలు హార్దిక్‌ పై ఒత్తిడి పెంచాయని ఆశ్విన్ పేర్కొన్నాడు.