Reading Time: 2 minutes
Mla Arava Sridhar Controversial Woman Threatens Self Harm Outside Jana Sena Office Seeking Justice

MLA Arava Sridhar controversy: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవర్ శ్రీధర్ ఎపిసోడ్ సంచలనంగా మారింది. తనకు న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని హర్షవీణ సంచలన ప్రకటన చేసింది. తాజాగా మరో కొత్త సెల్ఫీ వీడియో విడుదల చేసింది హర్షవీణ. అన్యాయం చేసిన మహిళలకు న్యాయం జరుగుతుందని బయటక వస్తే అటు జనసేన పార్టీ, ఇటు ప్రభుత్వం ఏమి చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఫేమ్ కావడానికి ఇదంతా చేయలేదని తెలిపింది.

RBL Bank: బిగ్ షాక్.. ఆర్బీఎల్‌ బ్యాంక్‌లో భారీ కుంభకోణం..

మహిళల పట్ల ఎంతో గౌరవం, వారి సమస్యల పట్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారనే నమ్మకంతోనే బయటక వచ్చానని స్పష్టం చేసింది. తాను చేసిన ఆరోపణలో నిజం లేకపోతే అదే బయట పెట్టాలని డిమాండ్ చేసింది హర్షవీణ. తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని.. తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చడానికి త్రిసభ్య కమిటీ వేసినప్పుడే సగం సక్సెస్ అయ్యారని వివరించింది. కానీ, వారి నుండి ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకుండానే ఎమ్మెల్యే మళ్లీ జనాల్లో తిరుగుతున్నాడని పేర్కొంది. ఈ వ్యవహారం తేలే వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించింది.

Job Market: అంబానీ, అదానీ కాదు.. దేశంలో అత్యధిక జీతాలు ఇస్తున్న కంపెనీలు ఇవే! టాప్-10 లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

పవర్ ఉందని మీరు ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారా అంటూ నిలదీసింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే తాను పవన్ కళ్యాణ్ ని కాక మరెవరిని అడగాలి అంటుంది బాధితురాలు. మీరంతా కలిసి అన్యాయం చేయాలనుకుంటే ఇక తనకు ఆత్మహత్య శరణ్యం అని హర్షవీణ అన్నారు. అలాగే ఇంకా ఆమె మాట్లాడుతూ.. కండువ వేసుకున్నాడు, నిన్న పార్టీ కార్యాలయానికే వెళ్లి మీటింగ్ పెట్టుకున్నాడు. నీకు అసలు పార్టీలోకే పార్టీ కార్యక్రమాలకే అనుమతి లేనప్పుడు నువ్వు పార్టీ కార్యాలయానికి ఎలా వెళ్తావు.. నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ జనసేన పార్టీ విజయవాడకు వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలపెట్టేసుకుంటానని ఆమె అన్నారు. అంతేకాకుండా ఏదో చేస్తారని చెప్పేసి సార్ నేను బయటిక వచ్చాను. పాపులర్ అవుదాం అని కాదు. శ్రీధర్ ను పాపులర్ చేద్దామని కాదు.. శ్రీధర్ ను నష్టపరుద్దాం అని కూడా కాదు.. ఇలా ఉంది.. ఇలా జరుగుతుంది.. నా ప్రయత్నాలన్నీ తర్వాత నేను ఇలా బయటికి రావడం జరిగింది. అది కూడా ఎవరి వల్ల? మీ మీద నమ్మకం వల్ల.. నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్ ఇంక ఇంతకంటే చెప్పలేను అని అన్నారు.