Reading Time: 2 minutes
Redmi 15a 5g Launched In India At Rs 12999 With 120hz Display And 6300mah Battery

REDMI 15A 5G Launched: షియోమీ (Xiaomi) సంస్థ భారత మార్కెట్లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ రెడ్ మీ 15A 5Gను లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్‌ లో పోటీని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ ను మంచి ఫీచర్లతో తీసుకొచ్చింది. ముఖ్యంగా పెద్ద డిస్‌ప్లే, దీర్ఘకాల బ్యాటరీ, లాంగ్‌ టర్మ్ సాఫ్ట్‌ వేర్ సపోర్ట్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..

డిస్‌ప్లే & డిజైన్:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ విజువల్స్ అందిస్తుంది. TÜV Rheinland సర్టిఫికేషన్లు ఉండటం వల్ల కళ్లకు రక్షణ కల్పిస్తుంది. ఇది గరిష్టంగా 810 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అవుట్‌డోర్‌లో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది.

MLA Arava Sridhar controversy: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుట ఆత్మహ*త్య చేసుకుంటా..!

సాఫ్ట్‌వేర్:
రెడ్ మీ 15A 5Gలో Unisoc T8300 ప్రాసెసర్‌ ను ఉపయోగించారు. 4GB & 6GB ర్యామ్ వేరియంట్లతో పాటు, వర్చువల్ ర్యామ్ ద్వారా అదనంగా 6GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOS 3.0పై పనిచేస్తుంది. కంపెనీ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని హామీ ఇచ్చింది.

కెమెరా ఫీచర్లు:
ఈ ఫోన్‌లో 32MP ప్రధాన కెమెరా ఉంది. దీనితో పాటు సెకండరీ కెమెరా కూడా అందించారు. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ:
ఈ కొత్త 5G మొబైల్ లో 6300mAh భారీ బ్యాటరీ ఉంది. దీనితో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో పాటు బాక్స్‌లోనే ఛార్జర్ అందిస్తున్నారు. అలాగే 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. 1000 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా 80% బ్యాటరీ హెల్త్ ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటితోపాటు ఈ మొబైల్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, FM రేడియో, IP52 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్, మైక్రోSD ద్వారా 1TB వరకు స్టోరేజ్ విస్తరణ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.

Grameen Credit Score: సిబిల్ స్థానంలో ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’.. బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు..

ధర:
ఈ ఫోన్ ఆసమ్ బ్లూ, అమజ్ పర్పుల్, ఏస్ బ్లాక్ వంటి మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ధరలు చూస్తే..
* 4GB + 64GB: రూ. 12,999
* 4GB + 128GB: రూ. 14,499
* 6GB + 128GB: రూ. 16,499 గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఏప్రిల్ 3 నుంచి ఫ్లిప్ కార్ట్, Mi.com అండ్ ఆఫ్‌ లైన్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి.