Reading Time: < 1 minute
Ttd Srivani Darshan Tickets New Rules Easier Booking Process For Tirumala Devotees

TTD Srivani Darshan Tickets New Rules: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ విధానంలో టీటీడీ మరోసారి కీలక మార్పులు చేసింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై డొనేషన్, దర్శన టికెట్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే విధంగా కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. దీంతో పేమెంట్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి.

LIC New Jeevan Anand: చనిపోయే వరకు తోడుండే పాలసీ.. రూ.45 తో రూ.25 లక్షల రిటర్న్స్‌తో పాటు లైఫ్ టైమ్ ఫ్రీ కవరేజ్!

ఈ కొత్త విధానం ప్రకారం భక్తులు ఒకే విడతలో గరిష్టంగా నాలుగు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ మార్పుతో కుటుంబ సభ్యులు కలిసి దర్శనానికి వెళ్లే వారికి మరింత సౌలభ్యం కలగనుంది. ప్రస్తుతం టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్‌ లైన్, ఆఫ్‌ లైన్ విధానాల్లో జారీ చేస్తోంది. ఆన్‌లైన్ విధానంలో రెండు రకాల బుకింగ్ సౌకర్యాలు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మూడు నెలల ముందుగానే టికెట్లు విడుదల చేస్తారు. భక్తులు తమకు అనుకూలమైన తేదీలకు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. మరోవైపు కరెంట్ బుకింగ్ విధానంలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అవసరాన్ని బట్టి భక్తులు తక్షణమే బుకింగ్ చేసుకునే వీలుంది.

Annamalai: బీజేపీలో అన్నామలై కుదుపు, పోటీకి దూరం.. కారణం ఇదే..