Reading Time: < 1 minute
Israel Iran Attack Pakistan Warning Embassy Tensions

Pakistan: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులతో పాకిస్తాన్‌లో కలవరం మొదలైంది. గురువారం రాత్రి 08 గంటల ప్రాంతంలో టెహ్రాన్‌పై ఇజ్రాయిల్ భారీ దాడి చేసింది. పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి సమీపంలో ఈ దాడి జరిగింది. తమ రాయబార కార్యాలయానికి సమీపంలో దాడి జరగడంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ‘‘దాడులు చేస్తే ఖతార్‌లా మేము మౌనంగా ఉండము’’ అని పాకిస్తాన్ ఇజ్రాయిల్‌ను గట్టిగా హెచ్చరించింది.

Read Also: US-Iran Conflict: పెరిగిన ‘‘పిజ్జా ఆర్డర్లు’’.. ఇరాన్‌పై బిగ్ యాక్షన్‌కు అమెరికా సిద్ధం..?

సమాచారం ప్రకారం.. రాయబార కార్యాలయాన్ని ఇజ్రాయిల్ నేరుగా లక్ష్యంగా చేసుకోలేదు. పాకిస్తానీ దౌత్యవేత్తలు, వారి సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. దాడి ఫలితంగా ఆ ప్రాంతంలోని నివాసాలు ఒక్కసారిగా వణికిపోయాయి. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఫోరం తీవ్ర హెచ్చరిక చేసింది. ఆ ప్రకటనలో, “పాకిస్తాన్ ఖతార్ కాదని ఇజ్రాయెల్ గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా మా దౌత్యవేత్తలకు హాని జరిగితే, మీరు ఎప్పటికీ గుర్తుంచుకునేలా మేము దాడి చేస్తాము” అని పేర్కొంది.

ఇరాన్ యుద్ధం ముగిసేలా అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్, యూఎస్ అంగీకరిస్తే ఇస్లామాబాద్ చర్చలకు వేదికగా మారుతుందని పాకిస్తాన్ చెబుతోంది. పాక్‌తో పాటు టర్కీ, ఈజిప్ట్ కూడా సమస్యను ముగించడానికి తెరవెనక చర్చలు సాగిస్తున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య గతంలో పరోక్ష చర్చలు జరిగాయని, అతి త్వరలో పాకిస్థాన్‌లో జరగనున్న సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్ అన్నారు.