Reading Time: < 1 minute
With 200mp Camera And 7000mah Battery Vivo V70 Fe Is Ready For Release

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో, వివో V70FE అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 2న విడుదల అవుతుందని కంపెనీ ధృవీకరించింది. ఇందులో 200MP రియర్ కెమెరా ఉంటుంది. వివో V70 FE భారీ బ్యాటరీ, హై-రిజల్యూషన్ కెమెరా, స్మూత్ డిస్‌ప్లే కావాల్సిన వాళ్లకు (ముఖ్యంగా స్టూడెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్) గ్రేట్ ఆప్షన్. కెమెరా ఎంతో బాగుంటుందని, డైలీ యూజ్‌కు పవర్‌ఫుల్‌గా ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి.

Also Read:Love Couple Arrested: వరుస దొంగతనాలు.. ప్రేమ జంట అరెస్ట్.. స్టోరీ తెలిస్తే షాకే..!

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆరిజిన్ ఓఎస్ ఉపయోగించనున్నారని, దాని సహాయంతో ఈ హ్యాండ్‌సెట్‌లో ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని పోస్టర్ వెల్లడిస్తోంది . రాబోయే వివో V70FE నార్తర్న్ లైట్స్ పర్పుల్, మాన్‌సూన్ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది. గత సంవత్సరం విడుదల చేసిన వివో V60 సిరీస్‌కు వివో V70 సిరీస్ ఒక అప్‌గ్రేడ్ అని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. వివో V70FE అనేది ప్రాథమికంగా ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఇది Y సిరీస్ కంటే పైన, X సిరీస్ కంటే దిగువన స్థానంలో ఉంది. ఇందులో Y సిరీస్ బడ్జెట్ ఫోన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, వివో X సిరీస్ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

Also Read:Chain Snatching: హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు రూట్ మార్చారు.. టెక్నీషియన్ అని నమ్మించి ఇంట్లోకి దూరి ఘాతుకం!

రాబోయే వివో V70FE ధర రూ.50,000 నుండి రూ.60,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. 6.83 ఇంచ్ 1.5K (1260 x 2800 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వరకు సపోర్ట్. P3 వైడ్ కలర్ గామట్, ఉన్నతమైన స్క్రీన్-టు-బాడీ రేషియోతో స్మూత్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. MediaTek Dimensity 7360 Turbo (4nm ప్రాసెస్) డైలీ టాస్కులు, మల్టీటాస్కింగ్, గేమింగ్ (మీడియం-హై సెట్టింగ్స్‌లో) సులభంగా నిర్వహిస్తుంది.