Reading Time: < 1 minute
Donald Trump Iran Supreme Leader Offer Claim Us Iran Talks

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటనలకు కేర్‌ ఆఫ్ అడ్రస్ అయ్యారు. తాను ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నానని, యుద్ధాన్ని త్వరగా ముగించడానికి ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఇటీవల పేర్కొన్నారు. అయితే, ట్రంప్ వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ గందరగోళం నడుమ అందరి దృష్టిని ఆకర్షించే మరో ప్రకటన చేశారు. కొంతమంది ఇరానీయులు తనకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. తాను నవ్వి, “నేను నిరాకరించాను. ప్రపంచంలో ఏ నాయకుడూ ఇరాన్ సర్వోన్నత నాయకుడు కావాలని కోరుకోడు” అని బదులిచ్చినట్లు చెప్పారు.

READ MORE: Vivo V70 FE: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. వివో V70 FE రిలీజ్ కు రెడీ

గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా ఇరాన్‌ను పూర్తిగా ఓడించిందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. “ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడని విజయాన్ని మనం సాధిస్తున్నాం. ఇరాన్ ఇప్పుడు చాలా త్వరగా ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటోంది. కానీ ఇరాన్ చాలా భయపడుతోంది. ఒకవేళ ఒప్పందానికి వస్తే సొంత ప్రజలే ఇరాన్‌ను నాశనం చేస్తారని అది భయపడుతోంది. ఈ తరుణంలో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని, హిజ్బుల్లా వంటి గ్రూపులకు మద్దతు ఇవ్వడం ఆపాలని, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ అమెరికా ఇరాన్‌కు 15-సూత్రాల ప్రతిపాదనను పంపింది.” అని ట్రంప్ చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తనకు ఇరాన్ సుప్రీం లీడర్‌గా అవకాశం వచ్చిందన్న వాదనలపై ఇంకా ఇరాన్ స్పందించలేదు.