Reading Time: < 1 minute
Sravanthi Chokkarapu Betting App Video Controversy Clarification

యాంకర్ స్రవంతి చొక్కరపు తాజాగా ఒక వివాదంపై ఘాటుగా స్పందించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించి ఒక ‘బెట్టింగ్ యాప్’ ప్రమోషన్ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండటంతో, ఆమె స్వయంగా రంగంలోకి దిగి అసలు విషయాన్ని బయటపెట్టారు. సదరు వీడియోపై క్లారిటీ ఇస్తూ.. అది ఇప్పటిది కాదని, చాలా కాలం క్రితం చేసిన పాత ప్రమోషన్ అని స్రవంతి స్పష్టం చేశారు. “ఆ సమయంలో నాకు వీటిపై సరైన అవగాహన లేదు. తెలియకుండా చేసిన తప్పు అది. కానీ ఇప్పుడు కావాలనే ఆ పాత వీడియోను మళ్ళీ వైరల్ చేస్తున్నారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఫాలోయింగ్ కోసం లేదా కావాలనే కొందరు వ్యక్తులు ఈ పాత అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

Also Read :Sreemukhi: హైదరాబాద్‌లో సొంత రెస్టారెంట్ ఓపెన్ చేసిన శ్రీముఖి

ఈ వివాదంపై స్రవంతి మరింత లోతుగా స్పందిస్తూ, ఈ ఇష్యూ ఎప్పుడో సర్దుమణిగిందని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, వివరణను ఇప్పటికే సంబంధిత అధికారులకు సమర్పించినట్లు వెల్లడించారు. చట్టపరంగా చేయాల్సిన ప్రతి పనిని పూర్తి చేశానని, ఇప్పుడు కొత్తగా దీనిపై చర్చించాల్సిన అవసరం లేదని ఆమె తేల్చి చెప్పారు. తన అభిమానులకు , సామాన్య ప్రజలకు స్రవంతి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పాత వీడియోలను చూసి మోసపోవద్దని కోరారు. ఆ వీడియో ఎక్కడ కనిపించినా వెంటనే ‘రిపోర్ట్’ చేయమని విన్నవించారు. తెలుపుతూ చేతులు జోడించారు.