Reading Time: < 1 minute

యూఎస్, ఇజ్రాయెల్ కోసమే హర్ముజ్ జలసంధిని మూసివేశాం..మిగతా దేశాలకు కాదు: ఇరాన్

Caption of Image.

చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేతపై  ఇరాన్ కీలక ప్రకటన చేసింది.  కేవలం  అమెరికా,  ఇజ్రాయెల్ దాని మిత్రదేశాలకు మాత్రమే  మూసివేశామని మిగతా దేశాలు యథావిధిగా నౌకల రాకపోకలు  సాగించవచ్చని  గురువారం (మార్చి5) ప్రకటించింది.అమెరికా,  ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం ప్రారంభమైనప్పటినుంచి గల్ఫ్ లో  వాణిజ్య రవాణా నిలిచిపోయిన క్రమంలో ఈ ప్రకటన చేసింది. ఇరాన్ ప్రకటనతో  చమురు రవాణాపై  అమెరికా, ఇజ్రాయెల్, దాని మిత్రదేశాలకు తప్పా భారత్ తోపాటు మిగతా దేశాలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. 

యుద్దం వంటి కీలక  సమయాల్లో హార్ముజ్ జలసంధిని  నియంత్రించే హక్కు ఇరాన్ కు  ఉందని ,అంతర్జాతీయ చట్టాలు, తీర్మానాలకు అనుగుణంగా ఇప్పటికే  స్పష్ట చేసినట్లు రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది.  అమెరికా, ఇజ్రాయెల్, యూరప్, వాటి  మిత్ర దేశాల నౌకలు ఏవైనా ఈ జలమార్గం గుండా  కనిపిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించింది. 

►ALSO READ | ఒక యుద్ధం..14 దేశాలు ఆగం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటికీ నుంచి ఇరాన్ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసింది. దీంతో  చమురు రవాణాలో ప్రపంచ దేశాలపై ఒత్తిడి ఏర్పడింది.యుద్దం కారణంగా షిప్ కెప్టెన్లు జలసంధి క్రాసింగ్ కు రిస్క్ చేయకపోవడంతో చమురు, గ్యాస్ తరలింపు నిలిచిపోయింది.
 
సముద్రం ద్వారా రవాణా చేసే చమురులో దాదాపు 5 శాతం  హార్జుజ్ జలసంధి  ద్వారా జరుగుతోంది. ఇది ప్రపంచ  దేశాలకు ఇంధన సరఫరాలో కీలక సంధి. అమెరికా దాని మిత్రదేశాలకు మాత్రమే జలసంధి మూసివేస్తున్నామని  ఇరాన్ ప్రకటనతో  అంతర్జాతీయ చమురు కంపెనీలకు కొంత ఊరట కలిగింది. 

©️ VIL Media Pvt Ltd.