
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం సిరియాపై కూడా ప్రభావం చూపింది. సిరియాలోని ఖమిష్లీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని బహిరంగ ప్రదేశంలో ఒక ఇరాన్ మిస్సైల్ ప్రమాదవశాత్తూ పడింది. అయితే.. ఆ మిస్సైల్ పడిన ప్రదేశంలో పెద్ద గుంత పడింది. మిస్సైల్ పేలకపోవడంతో స్థానికంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ మిస్సైల్ నేలకూలిన ప్రదేశంలో పిల్లలు గొర్రెలు కాస్తూ కనిపించారు. పిల్లలు ఆ మిస్సైల్ ఎక్కి ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
An unexploded projectile landed in an open field in the outskirts of Qamishli, eastern Syria.
Images show people, including children, standing near the Iranian-made missile on Wednesday. One photo shows a boy trying to climb on the missile. pic.twitter.com/cxfrbvD9ks
— ABC News (@ABC) March 5, 2026
వందల మందిని నామరూపాల్లేకుండా చేసే మిస్సైల్ బ్లాస్ట్ కాకపోవడంతో పిల్లల ఆటబొమ్మగా మిగిలిపోయింది. ఆ మిస్సైల్ సృష్టించే విధ్వంసం తెలియక పిల్లలు ఆ క్షిపణి ఎక్కి ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడం విశేషం. డిటోనేట్ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయినప్పటికీ మిస్సైల్ కావడంతో స్థానికులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సిరియా అధికారులు స్థానిక ప్రజలకు సూచించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం మొదలయ్యాక.. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ దాదాపు 8 వందలకు పైగా మిస్సైల్, డ్రోన్స్తో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది.
ఇరాన్ తన క్షిపణులు ‘షాహెద్’ డ్రోన్లతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. రియాద్‌లోని యూఎస్ ఎంబసీపై జరిగిన డ్రోన్ దాడిలో స్వల్ప అగ్నిప్రమాదం జరగగా, కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని నిరవధికంగా మూసివేశారు. కువైట్, బహ్రెయిన్, ఇరాక్, ఖతార్, యూఏఈలలోని తమ దౌత్య సిబ్బంది కుటుంబాలను అమెరికా వెనక్కి పిలిపించింది.
బహ్రెయిన్, ఇరాక్, కువైట్, యూఏఈలోని 6 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు పడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన ‘రాస్ తనూరా’పై కూడా ఇరాన్ దాడికి ప్రయత్నించగా, సౌదీ రక్షణ దళాలు అడ్డుకున్నాయి. ఇరాన్ దాడులతో దుబాయ్‌లోని ఒక హోటల్ తగలబడింది. యూఏఈలోని ఫుజైరా చమురు కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది.